ఉదయం ఆరుగంటల కు ఎస్సార్ నగర్లో మా లెన్స్ మేన్‌ని పికప్ చేసుకొని బయలు దేరాం… జనగామ సెంటర్లో ఆగి, రాగి ఇడ్లీ, పెసరట్టు రుచి చూసి , ఇక డైరెక్టుగా 200 కిలోమీటర్లు జర్నీ చేసి మహబూబా బాద్ చేరుకున్నాం.
అక్కడ చిన్న బావి నీటితో ఆరెకరాల సపోటా తోట పెంచుతున్న ఇంటర్ డ్రాప్‌అవుట్ యువ రైతు దరావత్ బాలాజీని ఇంటర్వ్యూ చేసి, కొన్ని సపోటాలు తీసుకొని తింటూ, గింజలను రోడ్ సైడ్ విసురుతూ… కొత్త గూడెం చేరుకునే సరికి మధ్యాహ్నం 3 దాటింది. లంచ్ చేద్దామనుకున్నాం కానీ, అవతల బొప్పాయి తోటలో భానోతు చిన్నా వెయిటింగ్లో ఉన్నాడు. అరగంటలో మాచిన పేట చేరుకునే సరికి మా ఆకలి ని గుర్తించిన చిన్నా బాగా పండిన పండ్లను ముక్కు చేసి లేత బొప్పాయి ఆకుల్లో మాకు అందించాడు. కెమికల్స్ లేకుండా పండించడం వల్ల, కొండ తేనెలా మధురంగా, తీయగా ఉంది రుచి.
‘‘ ఇదంతా ఒకపుడు అడవి … నేల కింద నీటి చుక్క లేదు… నాలు గేళ్లుగా ఈ మట్టితో సావాసం చేసి , ఇలా మార్చాను…’’ అంటూ, ఎండిన బొప్పాయి ఆకుల ను తెంచి చెట్టు మొదళ్లలో వేశాడు…ఇంతలో మా డిజిటిల్ కెమేరా స్టార్ట్ అయింది…
అతడి సక్సెస్‌ని చూడాల నుకుంటే… ఈ వీడియో క్లిక్ చేయండి!!