మనలో ఒక్కడే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకపుడు మీడియా సమాజానికి సేవ చేసిన వారికి అపుడపుడూ గుర్తింపు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏ పత్రిక చూసినా ” ఏడాదిలో ఎన్నికోట్లు సంపాదించాడో తెలుసా? ” అంటూ బాక్సులు కట్టి వాళ్లని ఆకాశంలో నిలబెడుతున్నారు. వాడొక్కడే, ఎదిగి ఆ సంపదని వాడి స్వార్థానికి వాడుకునే వాడి కంటే, కొన్ని వేల మంది జీవితాలను మలిచే టీచర్లు ఈ సమాజానికి కావాలి. అలాంటి టీచర్‌ కాని టీచర్‌ శ్రీనివాసులు.

గంజిహల్లి(కర్నూల్‌ జిల్లా)పంచాయితీకి సర్పంచ్‌ కూడా. గ్రామాభివృద్ధి పనులు చూసుకుంటూనే, ప్రతీరోజు పిల్లలందరికీ, పాఠాలు చెబుతుంటాడు. తమ గ్రామం భవిష్యత్‌ ఈ బిడ్డల మీదే ఉందంటాడు. ఆయన మాట్లాడుతున్నంత సేపు, నా కెన్నడూ కనిపించని దేవుడు ఆయనలో కనిపించాడు. వచ్చేస్తుంటే వీల్‌ ఛైర్‌ లోంచి లేచి ఒక ఆత్మీయ మైన హగ్‌ ఇస్తూ ” ఇంతవరకు మీలా, నాతో ఏ జర్నలిస్టు ముచ్చటించలేదు” అన్నాడు.

Share.

Leave A Reply