సేంద్రియ చేపలు.. తింటే వదలరు!!

Google+ Pinterest LinkedIn Tumblr +


కోనసీమలో కొత్త సాగు
……………………………………………………………..
రెండు పంటలు వరి పండే , సారవంతమైన గోదావరి జిల్లాల భూములను చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా డెల్టాలో 7 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరిగేది. ప్రస్తుతం వీటిలో 2 లక్షల ఎకరాలకు పైగా భూములను ఆక్వా చెరువులుగా మార్చేశారు. సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది.
ఆక్వా సాగు ముగిసిన తరువాత రసాయనాలతో కూడిన ఆ నీటిని పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. కొన్ని సార్లు మంచినీటి చెరువులలో సైతం కలిసిపోతోంది. దీంతో ఒకపుడు బావిలో నీళ్లు తోడుకొని తాగిన ప్రజలకు ఎక్కాడా రక్షిత మంచీనీరు దొరికే పరిస్థితి లేదు. ఫలితంగా ఇటీవల ఏలూరులో అంతుచిక్కని ఆరోగ్య సమస్యలు వచ్చాయని వైద్యులు అంటున్నారు. 50 బస్తాలు దిగుబడి వచ్చే వరి భూములు చౌడు భూములుగా మారిపోతున్నాయి. భూసారాన్ని కోల్పోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన పడుతున్నారు.
ఇలా ఎకరాలకొద్దీ భూమిని చేపల చెరువులుగా మార్చకుండా,నేల కలుషితం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా అని ఆలోచించాడు బిటెక్‌ చదివిన యువ ఇంజనీర్‌ దుర్గా ప్రసాద్‌. తక్కువ స్థలంలో, ఆర్గానిక్‌ పద్దతిలో ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే చేపలను పెంచడమే లక్ష్యంగా రష్యాలో రైతులు పర్యావరణ రహితంగా చేస్తున్న ఆర్‌ఏఎస్‌(రీసర్క్యులేటింగ్‌ ఆక్వాకల్చర్‌ సిస్టం)ను అధ్యయనం చేశాడు.
ఇంతకూ ఆ పద్ధతేంటో దుర్గా ప్రసాద్‌ మాటల్లోనే …
” ఏళ్లతరబడి చెరువుల్లో ఆక్వా సాగు వల్ల నేల సారం కోల్పోతుంది. అధికంగా నీళ్లు అవసరం అవడం వల్ల కొన్నాళ్లకు భూగర్భ జలాలూ కలుషితం అవుతాయి. అలాగే ఆక్వా రైతులు కూడా సుఖంగా లేరు. చిన్న వైరస్‌ వచ్చినా మొత్తం సాగు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. చికెన్‌, మటన్‌ కన్నా చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటారు. మరి చేపలు కూడా కలుషితమైతే మాంసాహారుల పరిస్దితి ఏంటి? …read full story in andhrajyothi

17-1-2021-andhrajyothi

అరుదైన గ్రామీణ విజయ గాథలు,  పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన rural media  తెలుగు ఛానల్ ని  జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber  మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply