అంతరించిపోతున్న108 జాతుల పక్షులు ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకపుడు ఉదయం లేవగానే పిచ్చుకలో,కాకులో మన పెరటి గోడమీద సందడిగా కనిపించేవి. వాటినిపుడు సెల్‌ఫోన్లో తప్ప ఎక్కడా చూడలేక పోతున్కాం. వాటిని చూడాలంటే, అడవులకు పోవాల్సిన పరిస్దితి ఏర్పిడింది. పక్షులను, పర్యావరణాన్ని పట్టించుకోక పోతే, ఎన్నో అనర్థాలను మనకు మనంగా తెచ్చుకున్నట్లే. మనుషులు చేసే కొన్ని పనుల వల్ల ఎన్నో రకాల పక్షులు,జంతువులు నేడు అత్యంత ప్రమాదంలో పడ్డాయి. అసలు పక్షులను, పర్యావరణాన్ని కాపాడటానికి మన వంతు ఏం చేయాలి? అనే ఆలోచన నుండి పుట్టిందే జాతీయ పక్షుల దినోత్సవం. (National Bird Day on January 5.)
జీవవైవిధ్యంలో మనదేశానిది, ప్రత్యేక స్థానం. పశ్చిమ కనుమలు, హిమాలయాలు, ఇండో-బర్మా సరిహద్దు ప్రదేశాల్లో ఎన్నో రకాల పక్షులు, జంతువులు కనిపిస్తాయి. మానవులు చేసే అనేక తప్పిదాల వల్ల ఎన్నోఅరుదైన పక్షులు వాటి ఆవాసాన్ని కోల్పోతున్నాయి. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ సంస్థ 2014 లో చేసిన సర్వేలో 15 జాతుల పక్షులు, 12 జాతుల క్షీరదాలు, 18 జాతుల సరీస పాలు, జలచరాలు అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్నాయి. మొత్తంగా 1000కి పైగా జీవ జాతులు ప్రమాదంలో ఉన్నాయి. పర్యావరణ సమతుల్యం సమంగా ఉండాలంటే జంతువులను, పక్షులను, సరీసపాలను కాపాడుకోవాలి.Pic byM.S.Reddy2
గత దశాబ్దకాలంలో వాటి సంఖ్య 80 శాతానికి తగ్గిపోయినప్పుడు అవి అత్యంత ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. క్రమం తప్పకుండా పక్షుల సంఖ్య తగ్గిపోతుంటే అవి అత్యంత ప్రమాదంలో ఉన్నట్లే.
పక్షుల సంఖ్య తగ్గడానికి కారణాలు
వివిధ అవసరాల కోసం మానవులు చెట్లను నరికివేస్తున్నారు. తద్వారా పక్షులు వాటి ఆవాసాన్ని కోల్పోతున్నాయి. వాటి సంఖ్య తగ్గడానికి ఇది అసలు కారణం.
వేటాడటం వల్ల కూడా అనేక రకాల పక్షులు చనిపోతున్నాయి.
వాయు, నీటి కాలుష్యాలు కూడా మరో కారణం. కాలుష్యం ద్వారా అనేక రోగాలు వచ్చి పక్షులు అంతరించి పోతున్నాయి. వాతావరణ మార్పులు, భూమి వేడెక్కడం, మంచు కరగడం మొదలైస వాటి వల్ల కూడా వాటికి ముప్పు పొంచి ఉంది. భారీ సాగునీటి ప్రాజెక్టుల వల్ల అటవీ ప్రాంతం తగ్గిపోవడం మరో ముఖ్యమైన కారణం.
టెక్నాలజీ వల్ల పక్షులకు ముప్పు..
సెల్‌ఫోన్లు వాడకం వల్ల పక్షులు అంతరించిపోతున్నాయి. రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ ద్వారా పక్షుల ఉనికి, వాటి నివాస స్థావరాలపై డ్యూక్‌ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కొన్ని జాతుల పక్షులు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 పక్షి జాతులు ఉండగా.. అందులో 108 పక్షుల రకాలు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు డ్యూక్‌ వర్శిటీ వెల్లడించింది.
” పక్షులు అంతరించి పోకుండా ఉండాలంటే, అవి గూడుకట్టుకొని ఉండటానికి చెట్లు కావాలి. మనం వాటిని నాశనం చేయడం వల్లనే పక్షుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతోంది?.
అందుకే పక్షులను కాపాడాలంటే వాటి ప్రదేశాలను నాశనం చేయకూడదు.” అంటారు హైదరాబాద్‌కి చెందిన పక్షిప్రేమికుల సంస్ద డెక్కన్‌ బర్డర్స్‌ సంస్ధ. వీరు నీళ్లమీద ఆధారపడే పక్షులను లెక్కపెట్టే ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.
పక్షులను రక్షించడం మన చేతుల్లోనే…
నేషనల్‌ పార్కుల్లో, లేదా కన్సర్వేటివ్‌, ప్రొటెక్టెడ్‌ ప్రదేశాల్లో వాటికి ఆవాసం కల్పించడం.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. ప్లాస్టిక్‌ని వీలైనంత వాడక పోవడం.
వేటాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, పేపర్ను రీసైక్లింగ్‌ చేయడం వల్లఎన్నో చెట్లను రక్షించవచ్చు. ప్రాజెక్టుల కోసం అటవీ భూములను సేకరించినపుడు అక్కడ కోల్పోతున్న చెట్లను తీసి వేరొక చోట నాటాలి. (All images By: M.S.Reddy)

Share.

Leave A Reply