ఊరు మారింది

Google+ Pinterest LinkedIn Tumblr +

అది శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరుసాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉండేవిఉన్న రెండుమూడు చెరువులు పూడికతో నిండి ఉండేవిఇక ఊరిలో రహదారులు అస్తవ్యస్థంగా ఉండేవిఊరి నిండా ఎటుచూసినా చెత్త దర్శనమిచ్చేదిపల్లెటూరి పిల్లల కోసం ఉద్దేశించిన అంగన్‌వాడీ కార్యక్రమానికి సరైన భవనం కూడా లేదుకానీ ఇదంతా ఒకప్పటి మాటఉపాధి హామీ పథకం గురించి వారికి పూర్తిగా అవగాహన లేని రోజులవికానీ నరేగా పథకం ఆ ఊరి స్వరూపాన్నే మార్చేసిందిఒకటి కాదురెండు కాదు.. అనేక రంగాల్లో ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి అభివృద్ధి మార్గంలో పయనిస్తోందిఉపాధి హామీ పథకాన్నిఎలా ఉపయోగించుకోవాలో ఓ నమూనాగా రాష్ట్రానికి చాటుతోంది

ఇంతకీ ఆ ఊరి వివరాలు చెప్పలేదు కదూఅదే చొర్లంగిశ్రీకాకుళం జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రానికి 45కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎల్‌ ఎన్‌ పేట మండలంలో ఉందిచొర్లంగి గ్రామ జనాభా 1569. ఇప్పుడీ గ్రామం ఉపాధి హామీ పథకాన్ని చక్కగా ఉపయోగించుకుంటోందిమొదట్లో నరేగా పథకం అంటే ఏంటో అవగాహన లేకపోయినా ఆ తర్వాత చకచకా అడుగులు వేసిందిఇప్పుడు ఆ గ్రామంలోని 453కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయిఉపాధి హామీ పథకంతో తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడమే కాదు.. ఊరి స్వరూపాన్నే మార్చేసుకున్నారీ పల్లెవాసులు.

చొర్లంగి గ్రామంలో వరిజీడిమామిడిరాగులు ప్రధానపంటలుఅంతకుముందు సాగునీటి సౌకర్యాలు పెద్దగాలేవుఉపాధి హామీ పథకం నిధులతో గ్రామస్తులు పంట సంజీవనులు తవ్వుకున్నారువాన నీటిని సంరక్షించుకునేలా కట్టడాలు నిర్మించుకున్నారుఊరిలోని చెరువుల్లో పూడికలు తీసుకున్నారుఇప్పుడు చొర్లంగి ఎన్టీఆర్‌ జలసిరులతో కళకళలాడుతోంది.

సాగునీటి సౌకర్యాల మెరుగుపడటంతో ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరిగిందిదీంతో వారు విభిన్నంగా ఆలోచించడం ప్రారంభించారుసాధారణంగా సాగు చేసే పంటలకు తోడు ఉద్యానవన పంటలు కూడా సాగుచేస్తూ ఆదాయం పెంచుకున్నారుకొందరైతే టేకు ప్లాంటేషన్ కూడా చేపట్టారుమరికొందరు వర్మి కంపోస్టు తయారీ చేపట్టి స్థానిక రైతులకు విక్రయించడం ప్రారంభించారు.

కొందరు రైతులు పెరటి తోటలు పెంచుతున్నారునాడెప్‌ కంపోస్టు పిట్‌లు కూడా తయారు చేస్తున్నారుఉపాధి హామీ విజయాల గురించి గ్రామ సర్పంచ్ మహిత సత్యనారాయణగారిని అడిగితే.. చెరువుల్లో పూడిక తీయడం వల్ల దాదాపు 2,120 ఎకరాల్లో దిగుబడి పెరిగిందని గర్వంగా చెబుతారుఅంతే కాదు.. ఇప్పుడు 50 ఎకరాల్లో సేంద్రీయ సాగు చేస్తున్న వైనాన్ని వివరించేటప్పడు ఆయన కళ్లలో ఎక్కడ లేని సంతృప్తి కనిపిస్తుందిఇవన్నీ ఉపాధి హామీ పథకం కారణంగా లభించిన రైతు విజయాలు.

చొర్లంగిలో ఉపాధి హామీ పథకం ముందుగా రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందిఆ తర్వాత ఆ గ్రామంలోనూ ప్రగతి వెలుగులు నింపిందిఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి ఎన్టీఆర్‌ గృహాలు మంజూరయ్యాయి.గ్రామంలో దాదాపు 320 వరకూ మరుగుదొడ్లు నిర్మించుకున్నారువాననీటిని ఒడిసిపట్టుకోవడం ద్వారా పొలాల్లో ధాన్య సిరులు పండిస్తున్న చొర్లంగి గ్రామస్తులు అదే ఒరవడిని ఇళ్లలోనూ కనబరిచారు. 300కు పైగా ఇళ్లలో ఇంకుడు గుంతలు తవ్వుకున్నారుఇంకుడు గుంతల ద్వారా భూగర్బజలాలు పెరిగాయి

ఉపాధి హామీ పథకం ద్వారానే చొర్లంగిలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారుగ్రామ ప్రతిష్ట పెంచుకున్నారుఅంగన్‌ వాడీ కేంద్రాలను కూడా నరేగా నిధులతోనే నిర్మించుకున్నారుగ్రామంలోని అంతర్గత కాంక్రీట్ రహదారులకు మూలమూ నరేగా నిధులేఇక ఊరిలో మరో ప్రధాన సమస్య పారిశుధ్యంఅందుకే ఊరిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కొత్త ఉపాయం కనిపెట్టారుగ్రామంలోని చెత్త ద్వారానే సంపద సృష్టించే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారుగ్రామంలో అవసరమైన చోట్ల కల్వర్టులను కూడా నిర్మించుకున్నారుఉపాధి హామీ పథకం గ్రామంలోని మౌలిక వసతులను కల్పించిందిసాగును గాడిలో పెట్టిందిఒక్కమాటలో చెప్పాలంటే గ్రామ స్వరూపాన్నే మార్చివేసింది

  •  అక్షర ప్రణవ్
Share.

Leave A Reply