మాస్కులు లేకుండా ఈ ప్రజలు కరోనాను ఎలా ఎదుర్కొంటున్నారు ?

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా మహమ్మారి ఒకవైపు అమెరికా వంటి అగ్ర దేశాన్నేగాక యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ… మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఆ నాలుగు పల్లెల్లోకి మాత్రం ఇప్పటికీ అడుగు పెట్టలేకపోయింది. గడిచిన 8 నెలల్లో ఈ పల్లెల్లో ఒక్కటంటే ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదని స్వచ్ఛంద సంస్థలు లెక్కలు తేల్చాయి. మాస్కులు, శానిటైజర్లు ఎలా ఉంటాయో కూడా తెలియని ఈ మారుమూల పల్లెలు కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కొంటున్నాయి?

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నుంచి 160 కిలోమీటర్లు వెళ్తే, తూర్పు కనుమల్లో… ఆకుపచ్చని కొండల మధ్య… గువ్వలా ఒదిగున్న గిరిజన గ్రామాలైన సంతోషపురం, మోరంగూడ, రాయగడ జమ్ము, పల్లం బరిడి కనిపిస్తాయి. ఈ గ్రామాల్లో చాలా ఇళ్ల ముందు వెదురుతో కట్టిన దడిలు, ఇంటి వెనుక జీలుగ చెట్లు, ఆరుబయట అరుగుల ముందు పెద్ద రాతి రుబ్బురోళ్లు, తిరగళ్లు, పచ్చళ్లు నూరే రాళ్లు దర్శనమిస్తాయి. గ్రామస్థుల ముఖాలకు ఎలాంటి మాస్కులు ఉండవు. పలుగు, పారలు పట్టుకుని పొలాలకు వెళ్తూ సాధారణ జీవనాన్ని గుర్తుకుతెస్తారు. ఇక్కడ వరి, పసుపు, రాగులు, సజ్జలు, జీడిమామిడి, జామ, పనస ప్రధాన పంటలు. ప్రతీ ఇంటి పెరట్లో కూరగాయలు పండిస్తారు. గ్రామం గోడల మీద ఎక్కడా రసాయన ఎరువుల ప్రకటనలు కనిపించవు. Full Story in Andhrajyothi

22.11.2020.andhrajyothi

Subscribe to honest journalism
RURALMEDIA is dedicated to give their audience variety of informative content about Agriculture Trends, Rural Skills and traditions and their products.
Culture, SuccessStories, which are deviant and out of the ordinary.
RURALMEDIA is your one stop destination to uncovering the answers to all.
And anyone can contribute to RURALMEDIA. Shoot for us, report for us –
your material is welcome so long as it meets the standards of this Channel and falls within our mandate:
the everyday lives of everyday people.
Subscribe to the New Emerging World Of Journalism today https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

Share.

Leave A Reply