అనారోగ్యమా.. 040-48214595 ఫోన్‌ చేయండి

Google+ Pinterest LinkedIn Tumblr +

వైద్యం కోసం ‘హెల్ప్‌లైన్‌’..
24 గంటలూ అందుబాటులో 140 మంది స్పెషలిస్టులు . ఫోన్‌ నంబర్‌: 040-48214595

‘ఫోరం ఫర్‌ పీపుల్స్‌ హెల్త్‌ ’సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవలు

ఆసుపత్రుల్లో ఔట్‌ పేషెంట్‌ సేవలు నిలిచి పోవడంతో ‘ఫోరం ఫర్‌ పీపుల్స్‌ హెల్త్‌ సంస్థ’ ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సేవలు ప్రారంభించింది . ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ : 040–48214595కు ఫోన్‌ చేస్తే సంబంధిత వైద్యులకు కనెక్ట్‌ చేస్తారు. తమకున్న సమస్యను డాక్టర్లకు వివరిస్తే ఫోన్‌లోనే మందులను సూచిస్తారు. అవసరమైతే మందుల చీటీ రాసిచ్చి వాట్సాప్‌లో పెడతారు.

ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా దాదాపు 140 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు సూచనలు అందిస్తారు. ఇది రేయింబవళ్లు అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సేవలన్నీ ఉచితం గానే ప్రజలకు చేస్తున్నట్లు ,
సంస్థ తరపున డాక్టర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు ఇటువంటి సేవలు అందిస్తున్నట్లు ఫోరం తెలిపింది.


చేసిన బాధితులు, రోగులతో దాదాపు 957 నిమిషాలు డాక్టర్లు మాట్లాడి వారికి సూచనలు ఇచ్చారు. మందులు సూచించారు. కొందరికి వాట్సాప్‌ ద్వారా మందుల చీటీని పంపించారు. సగటున ఒక్కో కాల్‌కు 4 నిమిషాలు వైద్యులు కేటాయించినట్లు రవీంద్రనాథ్‌ తెలిపారు. మారుమూల గ్రామం నుండి నగరాలు, పట్టణాల వరకు కూడా ప్రజలు ఫోన్లు చేస్తున్నారన్నారు. కొందరు వైద్యులు, సాంకేతిక వృత్తినిపుణులు తదితరులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశామని జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల ప్రసాద్‌ తెలిపారు.

Share.

Leave A Reply