‘విత్తనం’ ఒక జీవిత సత్యం!

Google+ Pinterest LinkedIn Tumblr +

ముసురుగా ఉంది.పైరగాలి చల్లగా, జివ్వు మంటున్నది.
ఉదయపు మబ్బులు కింద ఎర్రమట్టి నేలలో ప్రయాణం.
సదాశివపేట్‌ దాటగానే,
‘ఇక్కడ ఛాయి తాగితీరాలి…’ అన్నాడు మిత్రుడు.
ఇలాగే ఒక తెల్లవారు జామున ఇటు వెళ్తున్నపుడు, సౌమిత్ర ఈ ఛాయ్‌ని పరిచయం చేశాడు. అప్పటి నుండి ఈ దారిలో వెళ్లినపుడల్లా దీనిని రుచి చూడాల్సిందే! నీలోఫర్‌ కేఫ్‌ తరువాత గుర్తుండి పోయే టేస్ట్‌ ఇది.
వేడిగా వేస్తున్న కొన్ని క్యారట్‌ సమోసాలు ప్యాక్‌ చేయించుకున్నాం.
జహీరాబాద్‌ అవతల ఖాసింపూర్‌ లో రైతమ్మలు విత్తనాల బ్యాంక్‌ చూపిస్తాం అంటే బయలు దేరాం.
” రిటర్న్‌లో డిడిఎస్‌ వాళ్ల మిల్లెట్‌ రెస్టారెంట్‌లో అలసందల బిర్యానీ రుచి చూద్దాం…?” అపుడే లంచ్‌ కూడా డిసైడ్‌ చేశాడు డ్రైవర్‌.
అల్లం, అరటి విపరీతంగా పండించే, కోహిర్‌ గ్రామం దాటుతుంటే, సన్నటి చినుకులు మొదలయ్యాయి. ఇంకా రెండు గంటల జర్నీ…
ఏదైనా చదవాలనిపించి, ఫోన్‌లో అన్‌లైన్‌ పత్రికలు వెతుకుతుంటే, విత్తనం అనే కథ కనిపించింది.
”మండలంలో ఏ ఊరికి లేని సమస్యలు ఆ ఊరికే ఉన్నయి మరి. ఊరు చిన్నదే అయినా వాడకో లీడరు. లీడరుకో క్యాడరు…. ” అలా మొదలవుతుంది.. రచయిత మామూలోడు కాదు, అతడి శైలిలో మెస్మరిజం ఉంది. రెండు ఫోన్‌ కాల్స్‌ వచ్చినా కట్‌ చేసి, కథనంలో మునిగిపోయాను. బొందయ అనే ముసలి రైతుకు, ఎమ్మార్వోకు మధ్య జరిగిన మానవీయ కథ. చవడం పూర్తయాక బైట చినుకులు తగ్గాయి. కళ్లు చెమర్చాయి.
ఈ దశాబ్దపు తెలుగు సాహిత్యంలో మేలిమి ముత్యం లాంటి కథ.
‘నమస్తే తెలంగాణ’ లో 50వేల బహుమతి ఇచ్చారు. కానీ కోట్ల విలువైన జీవిత సత్యం ఉంది ఇందులో!!
మీరు చదవండి… ఈ లింక్‌లో … https://www.ntnews.com/sunday/article.aspx?ContentId=480372

Share.

Leave A Reply