ఆడపిల్లంటే మొదట్నుంచీ మనవాళ్లకు చులకనే. తొలికాన్పులో కొడుకే పుట్టాలని నోములు నోచేవారెందరో.. వారసుడే కావాలని కోరుకొనే తల్లిదండ్రులు లెక్కలేనంతమంది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్రావాలు చేయించే దుర్మార్గులు.. ఆడపిల్ల పుట్టిందని రోడ్డుపక్కన వదిలేసే దౌర్భాగ్యులు ఉన్న కాలంలో ఆడపిల్లను కన్న కోడలిని పూరెక్కలపై నడిపించిన అత్తమామల గురించి మీకు తెలుసా..
ఆ పసితల్లిని పూలపాన్పుపై పడుకోబెట్టిన సంతోషాన్ని చూశారా? మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నవీన్, రమ్య దంపతులకు ఆడపిల్ల పుట్టగానే అత్తమామల సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఆ అరుదైన వార్తను ‘నమస్తే తెలంగాణా’ బ్యానర్ గా ప్రచురించి, పాత్రికేయ విలువలకు కొత్త అర్ధం చెప్పింది.