అడవిలో ఆత్మీయులు… !!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచానికి ప్రాణవాయువునిచ్చే, అమెజాన్‌ అడవి అంటుకున్నదని ప్రపంచమంతా ఆందోళనపడుతున్న వేళ, తెలంగాణలోని, అలాంటి అడవినే కాపాడుతున్న గిరిపుత్రుల ఆరోగ్యానికి అండగా నిలిచారు ఇద్దరు వైద్యులు.
హైదరాబాద్‌లో క్లినిక్‌ పెట్టి, రోగులను పిండుకుంటూ,కూల్‌గా బతకాల్సిన వైద్యులు రాంబాబు,నరేందర్‌లు అడవి బాట ఎందుకు పట్టారో తెలియాలంటే చదవండి…
అదొక వాగులు,వంకల మధ్య ఉన్న ప్రాంతం. వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారులు లేవు. అలాంటి చోట బతుకుతున్న ఓ మహిళకు తీవ్రంగా రక్తస్రావం అవుతోంది… ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్‌ లేదు. ఈ దుస్థితిని చూసిన ఇద్దరు వైద్యుడు డోలీ కట్టి ఆమెను మోసుకుంటూ నాలుగు కిలో మీటర్లు నడిచి , భద్రాచలం సమీపంలో ఆంబులెన్ప్‌ దొరకడంతో ఏరియా ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు.
భద్రాచలం అడవుల్లోని రాళ్లచిలుకు తాండాలో, 14-8-19న జరిగిన సంఘట అది.
ఒక పూరింట్లో జీవిస్తున్న సుక్కి మాధవి (22)కి కవలబిడ్డలు పుట్టారు. ఆమెకు బ్లీడింగ్‌ ఆగక పోవడంతో అదే గ్రామంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు నరేంద్ర,రాంబాబులు ఆ తల్లి,బిడ్డలను డోలీలో
మోసుకెళ్లి, అంబులెన్స్‌ ఎక్కించి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్చారు.

Madavi sukki 22 yrs old delivered twin male babies at Rallachiluka hamlet elder baby wt 1.7 kgs With hypothermia 95 F and younger about 2 kgs mother HB 6 GMs with post partam Haemorrhage and PIH .


ఎవరీ డాక్టర్లు ?
డాక్టర్‌ రాంబాబు ఉలవనూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యుడు. అప్పటికే 20 తండాల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్‌ నరేంద్ర గురించి తెలుసుకొని, స్ఫూర్తి పొంది ఆయనకు తోడుగా గిరిజన తండాల బాట పట్టారు.
కొత్తగూడెం, పాల్వంచ అటవీ ప్రాంతం వైపు, అతికష్టం మీద టూవీలర్‌ వెళ్లగలిగే దారిలో…వాగులు, వంకలు దాటి, రాళ్లచెలక అనే తండాలో వీరిద్దరూ గిరిజనులకు వైద్య సేవలందిస్తున్నారు.
” విద్య, వైద్యం, విద్యుత్‌ తెలీని కుగ్రామమది. వారికి తెలుగు భాష తెలియదు, బయటి వ్యక్తిని అంతగా నమ్మరు. గొత్తికోయల భాషను నేర్చుకొని, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారికి దగ్గరయ్యాం. ఆ చుట్టుపక్కల 140 గూడేల్లో 20 వేలకు పైగా ఆదివాసీలు కనీస అవసరాలకు దూరంగా ఉన్నారని గుర్తించి వారిని ఆదుకునే ప్రయత్నంలో ఉన్నాం..” అని డాక్టర్‌ నరేంద్ర రూరల్‌ మీడియా తో చెప్పారు.
కదిలిన ప్రభుత్వం…
ఈ వైద్యుల కృషిని గుర్తించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్‌, ఐటీడిఏ అధికారులు ఆ తండాలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వచ్చారు. ఇరవై గ్రామాలకు తాగునీటి బావులు, కమ్యూనిటీ భవనాలు, సైకిల్‌ ఆంబులెన్స్‌లు మంజూరు చేశారు.

Share.

Leave A Reply