గాజుగ్లాసులో రెండు మూతల నన్నారిని పోసి, నిమ్మకాయ పిండి.. సోడాను గ్లాసులోకి పోస్తుంటే..నురగలు కక్కుతున్న ఆ పానీయం తాగి తీరాల్సిందే… కొంచెం తీపి, కొంచెం వగరు.. మరికొంచెం పులువు కగలిసిన ఆ రుచిని ఒక్క సారి చూస్తే వదలరు. ఇది రాయల సీమలో మాత్రమే దొరికే ఈ అద్భుత పానీయం. అడవిలో పెరిగే అరుదైన వేర్లతో తయారుచేసే ఈ లోకల్ షర్బత్ వెనుక, అడవిబిడ్డల అంతులేని శ్రమ ఉంది.
దట్టమైన అడవుల్లో రాళ్ల మధ్య పెరిగే ఔషధగుణాలున్న మొక్క నన్నారి. నల్లమల , శేషాచలం, అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. నీటి వసతి అవసరం లేదు. వాన చుక్కలు పడితే చాలు ,ఏపుగా ఎదుగుతుంది. దాని వేర్లు నేల లో రెండు మీటర్లు వరకు విస్తరిస్తాయి.
ఆరోగ్యానికి సంజీవని
నన్నారి షర్భత్ని శాస్త్రీయంగా తయారు చేస్తున్న ఏకైక ప్లాంట్‌ని చిత్తూరులో ఏపీ గిరిజన కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఇక్కడ ఏడాదికి 1,20,000 బాటిల్స్ తయారవుతున్నాయి. 800మంది గిరిజనులు అడవుల్లో సేకరించిన నన్నారిని ఇక్కడ ప్రాసెస్ చేసి , ల్యాబ్‌లో పరీక్ష చేసిన తరువాత మార్కెట్ చేస్తున్నారు. ఈ వేర్లుకు అనేక ఔషధ గుణాలతో పాటు, నిలువ ధాన్యంలోని పురుగు పుట్రను దరిచేరనివ్వని క్రిమిసంహారక గుణాలు ఉన్నాయి.‘‘ నన్నారిని ఆయుర్వేద ఔషధాలో విరివిగా వాడుతున్నారు. దీనిలో కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది. రక్తాన్ని శుద్ది పరుస్తుంది. మూత్రనాళవ్యాధును నయం చేస్తుంది.మబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది.’’ అని, చిత్తూరు జిల్లా GCC ప్రాంతీయ అధికారి జె.యస్టస్ మాతో చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన నన్నారీ పానీయం జిసిసి తయారు చేస్తుంది.

ఎక్కడ దొరుకుతుంది? నన్నారిపానీయం కావాల్సిన వారు జె.యస్టస్ (9490166272) కు కాల్ చేయండి. నన్నారి పంటను సాగు చేయాలనుకునే వారు సలహాల కోసం, కోవెల్ ఫౌండేషన్ (9440976848) కు కాల్ చేయండి.
పెప్సీ,కోక్‌లకు ధీటుగా గిరిజన్ కూల్ డ్రింక్?
జనం ఆరోగ్యంతో ఆడుకుంటున్న బహుళజాతి కూల్‌డ్రింక్స్‌కు పోటీగా ఔషధ గుణాలున్న రెండు అద్భుత పానీయాలు మార్కెట్ లోకి వచ్చాయి. అరకు,పాడేరు గిరిజన ప్రాంతాల్లో సేకరించిన సుగంధి,మారేడు బెరడులతో నన్నారి,బిల్వ పానీయాలను జిసిసి సంస్ద తయారు చేస్తోంది.
ఇటీవల జీసీసీ అధికారి జె.యస్టస్ రూరల్‌మీడియా తో ముచ్చటిస్తూ” నన్నారీ,బిల్వ షర్బత్‌లను విశాఖలోని పలు చోట్ల వెండింగ్ మిషన్ల ద్వారా అమ్మకాలు చేపట్టాం.వీటికి భారీ స్పందన రావడంతో టెట్రా ప్యాక్‌లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం.
ఈ వేసవిలో ఇప్పటి వరకు1,20,000 కు పైగా బిల్వ,నన్నారీ షర్బత్ బాటిల్స్‌ని జీసీసీ విక్రయించింది.వీటితో పాటు త్రిఫల జ్యూస్,పౌడర్లను కూడా జీసీసీ మార్కెట్లోకి తెచ్చింది. మా ఉత్పత్తులన్నీ త్వరలో వాల్ మార్ట్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. ముందుగా కాఫీ,తేనె,నన్నారీ,బిల్వ షర్బత్‌లను వాల్‌మార్ట్ స్టోర్లలో ప్రవేశ పెడతాం.”
అన్నారు..