కరవునేలలో ‘పంట’ పండింది…

Google+ Pinterest LinkedIn Tumblr +

గత 3 వారాలుగా అనంతపురం,ప్రకాశం జిల్లాల్లో Pradhan Mantri Krishi Sinchayee Yojana స్టడీలో భాగంగా మా టీమ్‌ ఫీల్డ్‌ విజిట్‌ చేసింది. కొరవి చిన కోటయ్య,యనమల ఆదినారాయణ, వలం శెట్టి పద్మ, నారిశెట్టి రమాదేవి, గరికపాటి రామకృష్ణ, కాశీవిశ్వనాధ్‌, సోడిశెట్టి శివకృష్ణ వంటి రైతులను,రాపూరి రాజకుమారి, గొర్రె అనంత లక్ష్మి, ధనమ్మ వంటి రైతు కూలీలను సుమారు అరవై మందిని కలిశాం.వారి ఉపాధి, ఉత్పాదకత గతంలో కంటే పెరిగిందని గుర్తించాం…

ఏపీలో ఈసారి కరవునేలలో కూడా ‘పంట’ పండింది. అన్ని రకాల పంటలు గతంకంటే ఎక్కువ దిగుబడులు వచ్చాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో విపరీతంగా వర్షాలు కురవడం.. సాగు విస్తీర్ణం పెరగడం కూడా దిగుబడులు పెరగడానికి కారణమయ్యాయి.
రాష్ట్రంలో వరి ఉత్పత్తి సుమారు 78.30 లక్షల టన్నులుగా ఉండొచ్చని మాతో వ్యవసాయ నిపుణులు అంటున్నారు. మిగతా పంటల దిగుబడులు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. ప్రధాన వాణిజ్య పంటలు మిర్చి, పత్తి, పొగాకు, శనగ, కంది దిగుబడులు కూడా బాగా పెరిగాయి.
ఆర్థిక గణాంక శాఖ అంచనా ప్రకారం …
జొన్న, సజ్జ,రాగి వంటి చిరు ధాన్యాల దిగుబడి హెక్టార్‌కు రెండింతలు పెరిగాయి. వేరుశనగ దిగుబడి హెక్టార్‌కు 484 నుంచి 1,035 కిలోలకు.. కంది 180 నుంచి 831 కిలోలకు చేరింది. మిర్చి, పత్తి, వేరుశనగ, కంది సాగులోనూ పెరుగుదల ఉంది. మిర్చి హెక్టార్‌కు గతేడాది ఖరీఫ్‌లో 3,142 కిలోలుగా ఉంటే ఈ ఏడాది అది 4,615 కిలోలుగా, పత్తి హెక్టార్‌కు 1,224 నుంచి 1,713 కిలోలకు చేరింది. 2018 -19లో హెక్టార్‌కు 150 కిలోలుగా ఉన్న జొన్న 1,036 కిలోలకు.. సజ్జ 1,010 నుంచి 2,322 కిలోలకు చేరింది.

ఫలితాన్నిచ్చిన రైతు సంక్షేమ పథకాలు
ఈ సారి విస్తారంగా కురిసిన వానలకు తోడు, రైతులకు వైఎస్‌ జగన్‌ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఒకరకంగా ఉపకరించాయి. రైతు భరోసా, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉత్పత్తులు పెరగడానికి దోహదపడ్డాయని ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అర్జున్‌ నాయక్‌ రూరల్‌ మీడియాకు చెప్పారు.గత దశాబ్దం తరువాత ఈ సారి మాత్రమే సమృద్ధిగా వానలు కురిశాయని, ఈ సారి కంది,శెనగ దిగుబడి ఎక్కువగా ఉంటుందని, లంకోజిన పల్లి, (దర్శి మండలం)కొరవి చిన కోటయ్య సంతోషంగా చెప్పారు.
” ఖరీఫ్‌ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా ఆ తర్వాత కురిసిన వర్షాలు పంటలకు కలిసి వచ్చాయి. అలాగే, రిజర్వాయర్లు నిండడంతో నీటి సమస్య లేకుండాపోయింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ప్రస్తుత రబీ సీజన్‌ నుంచి ఇచ్చిన పెట్టుబడి సాయం రైతులకు ఉపయోగ పడింది…” అని, అనంతపురం జిల్లా, కదిరి మండలం రైతు చంద్రా రెడ్డి చెప్పాడు.

Shyammohan with ruralmedia


ఎడారిని తలపించే, అనంతపురం, ప్రకాశం జిల్లాలో ఈ సారి రైతుల ఇంత సంతోషం కనిపిస్తోంది. ఏ మూలన చూసినా పండ్లతోటలు, వరి, ఇతర పంటలతో పచ్చగా కనిపిస్తోంది.
సేంద్రియ ఎరువులు వాడుతున్నందు వల్ల చీడపీడల బెడద కూడా ఈ ఏడాది తక్కువగా ఉంది. కొన్ని చోట్ల జామతోటలకు, పత్తికి మాత్రమే కొన్ని ప్రాంతాలలో తెగుళ్లు సోకినట్టు గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టినట్టు ,వ్యవసాయాధికారులు చెబుతున్నారు. Team/Ruralmedia

Share.

Leave A Reply