అంబసింగిలో ఒక వెరై’టీ’
శ్రమను కాచి,లాభనష్టాలను వడిబోసి, మధురమైన తేనీటి ఫలితాలను తలా కొంత ఆస్వాధించడం చూశారా? ఇదొక రుచికరమైన విజయం. ఆవి కేవలం కాఫీ ఆకులే కాదు, కొన్ని వందల గిరిజనుల చెమట చుక్కలు. ఆ శ్రమైక్యజీవన సౌందర్యాన్ని చూడాలంటే తూర్పుకనుమల్లోని ఆరకు,లంబసింగి వైపు వెళ్లాల్సిందే. అక్కడ కనుచూపు మేరా కాఫీ తోటలు కనువిందు చేస్తాయి. అరకు కాఫీకి ఒక చరిత్ర ఉంది. ఇపుడు కాఫీ ఆకుల పానీయం ఆ చరిత్రకు ఒక కొనసాగింపు.
అరకు వ్యాలీలో ఆకులు సేకరించి, సిలికాన్ వ్యాలీలో రిసెర్చ్ చేసి,
హైదరాబాద్‌లో ఆర్గానిక్ ఛాయ్ తయారీ చేస్తున్నారు.
ఈ చాయ్‌లో ఏముంది?
కెఫిస్ తక్కువగా, కత్రిమ రుచులకు దూరంగా ఉండడమే ఈ టీ ప్రత్యేకత. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కాఫీ ఆకులకు, అనాస పువ్వు, నిమ్మగడ్డి చేర్చి ఈ గ్రీన్ టీ ని ఎలా చేశారో చూడండి…
……………………………………………………………………….
Rural Media తీసిన మరి కొన్ని వినూత్న వీడియో లు చూడండి.
మట్టి లేకుండా ప్రక్రుతి పంటలు
మీకు ఎకరాల భూమి అవసరం లేదు, ఇంటిముందు విశాలమైప పెరడు కూడా ఉండక్కరలేదు. అసలు మట్టి కూడా వద్దు. అపార్ట్మెంట్లో జస్ట్ చిన్న బాల్కనీ ఉంటే చాలు, క్యాబేజీ,బ్రకోలీ తో సహా అన్ని రకాల కాయగూరలు పెంచుకోవచ్చు. ఇవన్నీ మట్టి అంటకుండా, కొన్ని నీళ్లతో మాత్రమే పెరుగుతాయి. ఈ వీడియోలో చూడండి.
అరటి
గెల తయారయ్యక చెట్లను ఇలా నరికి పారేస్తారు.
అక్కడితో అరటి సాగు పూర్తవుతుంది.
” కానీ మా స్టోరీ ఇక్కడ
నుండే మొదలవుతుంది…” అన్నారు, కృష్ణానదీ తీరంలో మహిళలు. వీరి ప్రతీ అడుగులో
మాకు అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మీరూ చూస్తారా ? https://youtu.be/sxHJWAnjO5M