కలెక్టర్‌ కుర్చీలో విద్యార్దిని, చేతులు కట్టుకొని నిలబడ్డ కలెక్టర్‌ ?

Google+ Pinterest LinkedIn Tumblr +

  అవును మీరు చదివిన శీర్షిక నిజమే…

అది అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆఫీసు.

కలెక్టర్‌ సీట్‌లో ఇంటర్‌ విద్యార్ధిని శ్రావణి దర్జాగా కూర్చొని సీరియస్‌గా ఫైల్స్‌ పరిశీలిస్తోంది.

ఆమె పక్కనే వినయంగా చేతులు కట్టుకొని నిలబడిన కలెక్టర్‌ వాటి గురించి చెబుతుంటే ఆమె టకటకా సంతకాలు చేస్తోంది. అలా …

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 మే పరిహారం అందించే ఫైల్‌   అలాగే , రాత్రి 8 గంటల తర్వాత, ఉదయం 8 కు ముందు మహిళా ఉద్యోగును అధికారిక పనుల గురించి ఫోన్లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వు జారీ ఫైల్‌ మీద కూడా ఆ బాలిక సంతకాలు చేశారు.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం(11.10.2020) సందర్భంగా అనంతపురం జిల్లాలో నిర్వహించిన  వినూత్న కార్యక్రమం ఇది.

గంధం చంద్రుడు ఒకవైపు, చుక్కలు  ఒకవైపు!!

District Collector Gandham Chandradu

 ప్రజల హృదయాలను  గెలిచే అరుదైన అధికారుల్లో ముందుంటారు, అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు. బాలికా దినోత్సవాన్ని ఆదర్శవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో  రోజంతా , కలెక్టర్‌ స్థాయి నుంచి మండల స్థాయి అధికార బాధ్యతలను జిల్లాలో బాలికలకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా  ఈ తరహా కార్యక్రమాన్ని అమలు చేయడం దేశంలోనే ఇది తొలిసారి.

‘బాలికే భవిష్యత్‌’ పేరుతో పాలనాధికారి చంద్రుడు ప్రారంభించిన ఈ  వినూత్న కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో  తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు గా వివిధ ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న బాలికలు  బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్  కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి చీరకట్టులో వచ్చి కలెక్టర్‌ కుర్చీలో కూర్చోగా, పక్కనే చంద్రుడు  చేతులు కట్టుకుని నవ్వుతూ నిబడ్డారు.

 కలెక్టర్‌  శ్రావణి బాధ్యతు చేపట్టిన సమయానికే..అనంతపురం జిల్లా వివిధ మండలాల్లో తహశీల్దార్‌, ఆర్‌ఐలు గా మరికొందరు ఆడబిడ్డలు విధుల్లో చేరారు.ఆదివారం(11.10.2020) ఉదయం 11 గంట నుంచి సాయంత్రం 6 గంట వరకు విద్యార్దినులు విధుల్లో ఉంటారు.

 ‘బాలికే భవిష్యత్‌’ కార్యక్రమంలో  అధికారిణులు గా, బాలికలు  ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని వెంటనే అమలు చేయాని కలెక్టర్‌ చంద్రుడు శనివారం  ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేసే అధికారాల ను సైతం బాలికలకు కట్టబెట్టడం అరుదైన ముచ్చట.

 ఈ యువ కలెక్టర్‌ నిబద్దత పై సామాజిక మీడియాలో అభినందనల వాన కురుస్తోంది.

Adesh Ravi

‘‘ సార్‌ మీలాంటి నిబద్ధత కలిగిన అధికారులు బహు అరుదు. మీరు చేసిన ఈ పని చాలా బాగా నచ్చింది. బ్యూరోక్రాట్ల పట్ల ప్రజల్లో మరీ ముఖ్యంగా యువతలో ఒక అవగాహన రావాలి అంటే ఇలా చేయడం ఉత్తమం. దీని ద్వారా బాలలు భవిష్యత్‌ లో అవినీతికి తావులేని అధికారులు గా మారడానికి అవకాశం ఉంటుంది..’’ అంటారు ప్రముఖ రచయిత, గాయకుడు ఆదేశ్‌ రవి.

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg42, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply