నిర్మాణాత్మక డిజిటల్‌ విద్య

Google+ Pinterest LinkedIn Tumblr +

From ‘black board’ to ‘digital board’,

Government schools  are witnessing a technological revolution

చాక్‌పీసులు పట్టుకుని బోధించే రోజుల నుంచి మౌస్‌తో ప్రాజెక్టర్‌పై పాఠాలను చెప్పే తీరును ‘నిర్మాణ్‌’ స్వచ్ఛంద సంస్ధ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తోంది.
ఇందుకు తొలివిడతగా తెలంగాణాలో 30 పాఠశాలలను ఎంపిక చేసింది. డిజిటల్‌ విద్యకు సంబంధించి అన్ని పరికరాలను సమకూర్చింది. డిజిటల్‌ బోర్డులపై చిత్రాల ద్వారా ప్రదర్శిస్తూ సవివరంగా భోదన చేయనున్నారు. ఆయా సబ్జెక్ట్‌లోని అంశాలను విద్యా శాఖ అధికారులు తయారుచేసిన హార్డ్‌డిస్క్‌ల సహాయంతో ఉన్నత ప్రమాణాలు పెంచేందుకు దోహదపడనున్నారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ సమీపంలోని కొత్తగూడ, మణికొండలోని జడ్‌పీ హైస్కూల్‌లో నిర్మాణ్‌ ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాసురూమ్‌లను ‘రూరల్‌మీడియా’టీం సందర్శించింది.
బేసిక్స్‌ పై అవగాహన పెరిగింది

Students at Digital class room in Z.P.High school, Kothaguda (RR Dist)

Students at Digital class room in Z.P.High school, Kothaguda (RR Dist)

ఈ రెండు ప్రభుత్వ బడుల్లో 50 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు.వారానికి నాలుగు రోజలు పాటు అన్ని తరగతుల విద్యార్దులకు కంప్యూటర్‌ పరిజ్నానం పై అవగాహన కల్గిస్తున్నారు. కంప్యూటర్‌ క్లాసులనగానే ఎంతో ఉత్సాహంగా విద్యార్ధులు కంప్యూటర్ల ముందుకు చేరుతున్నారు.
” మా హైస్కూల్‌లో 928 మంది విద్యార్దులు చదువుతున్నారు. ఆగస్టు8,2018న డిజిటల్‌క్లాసు రూం ప్రారంభమైంది. రోజురోజుకు విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న క్రమంలో చిన్న వయస్సులోనే కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంచడం వల్ల వారిలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. డిజిటల్‌ క్లాసు రూంతో పాటు ఇద్దరు విద్యావాలంటీర్లను, ఒక వాచ్‌మెన్‌,మరొక పారిశుద్ధ్యకార్యికురాలికి కూడా ఉపాధి కల్పించారు, నిర్మాణ్‌ సంస్ధ. దీని వల్ల ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేందుకు పిల్లలు క్యూకడుతున్నారు.” అన్నారు, కొత్తగూడ జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌ జె గోవింద్‌.
విద్యార్ధుల్లో ఆసక్తి
‘ గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలలో, ముఖ్యంగా ఉన్నత, మాధ్యమిక పాఠశాలలలో, కంప్యూటర్లు వినియోగాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించడానికి, కంప్యూటర్‌ పరికరాలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సదుపాయాలు, అందుబాటులోవుండేలా చూసి విద్యార్దులకు కంప్యూటర్‌ పైకనీస అవగాహన కల్పిస్తున్నాం.విద్యార్ధులు ఎంతో అసక్తి కనబరుస్తున్నారు.’
అంటారు కంప్యూటర్‌ ల్యాబ్‌లో పిల్లలకు పాఠాలు నేర్పుతున్న శాలిని,శశికళ.

Students in Digital class room in Z.P. high school, Manikonda(RR Dist)

Students in Digital class room in Z.P. high school, Manikonda(RR Dist)

మణికొండ బడికి సాంకేతికత అండ
” మా స్కూల్‌లో910మంది విద్యార్దులు చదువుతున్నారు. సంవత్సరం క్రితం నిర్మాణ్‌ సంస్ద మాకు డిజటల్‌ క్లాసు రూం ఏర్పాటు చేసి విద్యార్దులకు ఎంతో మేలు చేశారు. కంప్యూటర్‌ విద్యా విధానం వల్ల తెలివైన విద్యార్థితో పాటు సాధారణ విద్యార్థికి కూడా సులువుగా బోధించే అంశాలు అర్ధం అవ్వడంతో పాటు తరగతిలోని విద్యార్థులందరూ సమాన ప్రతిభ కనబర్చడంతో ఆరోగ్యకర పోటీ వాతావరణం ఏర్పడనుంది. ఇటువంటి సమయాల్లో విద్యార్థులకు కూడా ఒత్తిడి లేని బోధన సాధ్యమవుతుంది. బోధించే అంశాలను స్క్రీన్‌పై చూపించడం ద్వారా విద్యార్థి ఎక్కువ ఉత్సాహంగా చదివే ఆస్కారం ఉంది.” అన్నారు.మణికొండ,జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, హెడ్‌మాస్టర్‌ వి.నిరంజన్‌.

గ్రామీణ ప్రాంతాల్లోడిజిటల్‌ విద్య

Digital class room in zillaparishat high school, Manikonda(RR Dist)

Digital class room in zillaparishat high school, Manikonda(RR Dist)

” విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామాల నుంచి పట్టణాల్లోని స్కూల్స్‌కు మార్పించేందుకు ఆలోచన చేస్తున్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో డిజిటల్‌ విద్యను ప్రవేశ పెట్టి రోల్‌మోడల్‌గా నిలవాలనే ఆలోచనతో డిజిటల్‌ క్లాసురూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం.
సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తరగతి గదులను మార్పు చేస్తూ ప్రొజెక్టర్‌లు, కంప్యూటర్‌లు, టీవీలతో భోదించడంతో విద్యార్థులు కొంగొత్త అనుభూతి పొందనున్నారు. ప్రస్తుతం వేగంగా సాప్ట్‌వేర్‌లో చోటుచేసుకుంటున్న మార్పులను విద్యార్థులకు అందిపుచ్చే క్రమంలో భాగమే డిజిటల్‌ బోధన. ఈ మహత్తర కార్యక్రమానికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చేయూతనివ్వడంతో ‘నిర్మాణ్‌ టీం’ అమలు చేస్తోంది.” అన్నారు నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ఫౌండర్‌ మయూర్‌ పట్నాల.
ప్రైవేట్‌ పాఠశాలలు డిజిటల్‌ విద్య వైపు ఆలోచించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వపాఠశాలల్లో డిజిటల్‌ విద్యను అమలుపరిచి ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలబడే విధంగా ‘నిర్మాణ్‌’ తోడ్పడుతోందని ఉపాధ్యాయులు,విద్యార్దుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Leave A Reply