రైతులకు ఉచిత బోర్లు…

Google+ Pinterest LinkedIn Tumblr +

వై.ఎస్.ఆర్ జలకళ

      రైతులకు ఉచిత బోర్లు

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా Y.S.Jagan ఇచ్చిన హామీ మేరకు నేడు రైతులు ఉచిత బోర్లు వేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కావున అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి .

నిబంధనలు :-

1) ఉచిత బోరుకు దరఖాస్తు చేరుకోవాలంటే కనీసం 2.50 ఎకరాలు భూమి ఉండాలి.

2) రెండున్నర ఎకరాలు భూమి లేకపోతే పక్కన ఉన్న రైతులను కలుపుకొని ఒక గ్రూప్ గా కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు.

3) దరఖాస్తుతో పాటు, పట్టాదారు పాసుపుస్తకం ఫొటో స్టాట్ కాపీ,

4) ఆధార్ కార్డ్ ఫొటో స్టాట్ కాపీ,

5) పాస్ పోర్ట్ సైజ్ ఫొటో జతపరిచి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ కు అందజేయాలి.

6) ఒక ఇంటికి ఒక బోరు మాత్రమే అర్హులు.

7) గతంలో బోరు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు కారు.

8) బోరుకు బోరుకు మధ్య 200 మీటర్ల మధ్య దూరం ఉండాలి.

9) గతంలో బోరు వేసుకొని ఫెయిల్ అయి ఉంటే దరఖాస్తు చేసు కోవచ్చును.

10) ఉచిత బోరుకు పై అర్హతలు కలిగిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చును.

11) చిన్న, సన్నకారు రైతులకు ఉచితబోరుతో పాటు కేసింగ్, విద్యుత్ కనెక్షన్, మోటారు కూడా ఉచితమే.

గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వద్ద దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి.

వీఆర్వో భూమిని పరిశీలించి పై అర్హతలు ఉంటే ఆమోదించాలి. లేక పోతే తిరస్కరించాల్సివుంటుంది.

దరఖాస్తు చేసుకొనేందుకు గడువు 15-03-2021. అర్హులైన, ఆసక్తి కలిగిన రైతులందరూ గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలి .

Share.

Leave A Reply