వీళ్లు అడివిని జయించారు

Google+ Pinterest LinkedIn Tumblr +

మారు మూల అడవుల్లో చెట్లూ,పుట్టల వెంట తిరుగుతూ దొరికిందల్లా ఏరుకుని బతికే వాళ్లు… 
రెక్కాడితే గానీ డొక్కాడని అతి సాధారణ పేదవాళ్లు 
నిరంతరం బతుకు పోరాటంలో నలిగిపోతున్న ఆదివాసీలు 
 పని,వెట్టిచాకిరీ,కాయకష్టం, చెమట చిందితేనే పొయ్యిమీద అన్నం ఉడికేది. 
ఇలాంటి అట్టడుగున వున్న ఎవరికీ పట్టని యానాదులు కూడా ఒక అద్బుతం సృష్టించ గలరంటే మీరు నమ్మగలరా? వాళ్లు సాధించింది మామూలు విజయం కాదు.   
ఏకంగా బీడు భూములను సస్యశ్యామలం చేశారు. వర్షాధారం తప్ప వేరే దారి లేక పోయినా కురిసిన ప్రతీ వాన బొట్టును ఒడిసి పట్టుకొని భూమిలోకి ఇంకేలా చేశారు. బంజరు నేలలో బంగారు పంటలు సృష్టించారు.
మొక్కల పెంపకం, భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు వ్యవసాయ నిపుణులు. 
అమాయకమైన గిరిజనులను ఆత్మవిశ్వాసం తొణికిసలాడే రైతులుగా మార్చారు. 
భూస్వాముల తోటలకు రేయిం బవళ్లు కాపలాగా బతికిన వారు నేడు సొంత తోటలకు యజమానులయ్యారు. 
ప్రభుత్వం, ఎన్జీవోలు, స్ధానికులు కలిసి కృషి చేస్తే ఎంత గొప్ప అభివృద్ది జరుగుతుందో , ఎంత మంది భవిష్యత్‌కు పూల దారులు వేయగలదో చేసి చూపిన సామాజిక అద్బుతం ఇది. 
గత ఎనిమిది నెలలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉండే 12 జిల్లాల్లో ‘రూరల్‌ మీడియా’ బృందం తిరిగింది. వారితోనే ఉండి, వారు పెట్టిందే తిని,తాగి, వారి కష్టాల్ని,నష్టాల్ని, సంతోషాలని, వారి సాగును ,సంస్కృతిని, చేతి వృత్తులను వారి సమస్త జీవన చిత్రాన్ని డాక్యుమెంట్‌ చేసింది. ఆ కథనాలన్నీ www.ruralmedia.in లో…. అతి త్వరలో మీ ముందుంచ బోతున్నాం…

Share.

Comments are closed.