శ్రీసిటీలో,నైపుణ్యశిక్షణ… శిక్షణానంతరం ఉద్యోగం …

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీలో పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణాకేంద్రం ప్రారంభం – పరిశ్రమల్లో యువతకు ప్రత్యక్ష శిక్షణ- శిక్షణానంతరం అదే పరిశ్రమలో ఉద్యోగం – రాష్ట్రంలో మొట్టమొదటి కేంద్రం శ్రీసిటీలో ఏర్పాటు  
శ్రీసిటీ, అక్టోబర్ 07, 2020:
రాష్ట్రంలో ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి), శ్రీసిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ నియామక కేంద్రం (ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ సెంటర్  – ఐసిఎస్‌టిపిసి) ను బుధవారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధరబాబు దీనిని ప్రారంభించగా, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి,  ఎపిఎస్‌ఎస్‌డిసి సీఈఓ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతస్థాయి సలహా కమిటీ సభ్యులు రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ కెవిఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ, యువతకు శిక్షణతో పాటు ఉద్యోగం కల్పించే ఈ బృహత్తర కార్యక్రమం సంయుక్తంగా చేపడుతున్న ఎపిఎస్‌ఎస్‌డిసి, శ్రీసిటీ యాజమాన్యాలకు ఆయన అభినందనలు తెలిపారు. తమ చదువుకు తగినట్లు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఏండ్ల తరబడి చాలామంది యువకులు ఖాళీగా వుంటున్నారని, అలాంటి భావాలను వీడి, తగు నైపుణ్యం పొంది ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన యువతకు సూచించారు. ఈ శిక్షణాకేంద్రం ఇతర సెజ్ లు, పారిశ్రామికవాడలకు మార్గదర్శకంగా కానుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 
కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన రవీంద్ర సన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ తరహా నైపుణ్య శిక్షణాకేంద్రం ఏర్పాటుకు రాష్ట్రంలో మొట్టమొదటగా శ్రీసిటీకి ప్రాధాన్యత ఇచ్చినందుకు రాష్ట్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికరంగం కొత్త నైపుణ్యాలను వెదుకుతూ వేగంగా ముందుకు సాగుతోందని, విద్యా పాఠ్యాంశాలు మరియు విద్యార్థుల నైపుణ్యాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా లేనిపక్షంలో, ఉద్యోగాలు పొందడానికి, పొందిన వాటిని నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుందన్నారు. ఈ అంతరాన్ని తగ్గించడానికి, పరిశ్రమల సహకారంతో ఎపిఎస్‌ఎస్‌డిసి వివిధ ట్రేడ్‌లలో పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందిస్తుందన్నారు. స్థానిక యువత మంచి నైపుణ్యాలు, ఉద్యోగాలు పొందడంలో ఈ శిక్షణ కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీసిటీలో జపాన్ పరిశ్రమలతో ఏర్పాటైన జిమ్ శిక్షణా కేంద్రం, టీవీఎస్, ఐఎల్ఎఫ్ఎస్ నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉన్నాయని, అయితే వాటి అన్నింటికీ కాస్త భిన్నంగా ఎపిఎస్‌ఎస్‌డిసి, శ్రీసిటీ, పరిశ్రమ యాజమాన్యాలు భాగస్వామ్యంతో ఈ కొత్త శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక యువతకు పిలుపునిచ్చారు. శ్రీసిటీలోని ఇసుజు, థెర్మాక్స్, వీఆర్వీ మరికొన్ని సంస్థలు ఈ శిక్షణా భాగస్వామ్యులు కావడానికి ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

ఆర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాల మేరకు అదే పరిశ్రమల వారిచే యువతకు తగు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే ఆలోచనకు సహకరించిన ఆల్స్టమ్, శ్రీసిటీ యాజమాన్యాలకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో నెలకొల్పేందుకు ఒక మోడల్ గా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.    

ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎపిఎస్‌ఎస్‌డిసి ప్రత్యేక చర్యల చేపట్టడం ద్వారా వివిధ రంగాలలో పరిశ్రమలకు అవసరమైనరీతిలో యువతను తీర్చిదిద్దెందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు  ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. 
ఆల్స్టమ్ పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్ విజయ్, ఇంకా  ఇసుజు, థెర్మాక్స్ పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. 
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు ఆల్స్టమ్,  థెర్మాక్స్ పరిశ్రమలను సందర్శించారు. 
కాగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 30 మంది డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులను ఎంపిక చేసి, శ్రీసిటీ ఆల్స్టమ్ పరిశ్రమలో మొదటి బ్యాచ్ శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శ్రీసిటీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎపిఎస్‌ఎస్‌డిసి శిక్షణా కేంద్రంలో వారం పాటు కమ్యూనికేషన్, కంప్యూటర్స్, ఆటిట్యూడ్, ఇతర సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇచ్చి, ఆపై  ఆల్స్టమ్ పరిశ్రమలో పరిశ్రమ ఆధారిత ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నెల రోజుల శిక్షణ అనంతరం వారికి అదే పరిశ్రమలో వెంటనే ఉద్యోగం కల్పిస్తారు. నిరంతర ప్రక్రియగా వెంటవెంటనే కొత్త బ్యాచ్ లు కూడా ప్రారంభిస్తారు. శ్రీసిటీలోని పలు పరిశ్రమలు శిక్షణ భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. శిక్షణ సమయంలో ఉచిత భోజన, బస వసతులు కల్పిస్తారు. ఆసక్తి వున్నవారు ఎపిఎస్‌ఎస్‌డిసి వెబ్ సైట్ లో తమ దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి వుంటుంది.  
01 – నైపుణ్య శిక్షణాకేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ చక్రధరబాబు 02 – ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న శ్రీసిటీ ఎండీ 03 – ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న  చక్రధరబాబు04 – శిక్షణకు విచ్చేసిన మొదటి బ్యాచ్ విద్యార్థులతో ప్రతినిధులు 05 – శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ప్రతినిధులు .

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg4

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

………………………………………………

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .


Share.

Leave A Reply