పబ్లిక్‌ టాక్‌ …. !!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెల్లవారు జాము, మూడున్నరకే లేచి, రమేష్‌గారిని పికప్‌ చేసుకొని సికింద్రాబాద్‌ స్టేషన్‌కి చేరుకోగానే, టికెట్‌ కౌంటర్‌ నుండి స్టేషన్‌ బయట వ రకు పెద్ద క్యూ… ఈ లైన్‌లో నిలబడి టికెట్‌ తీసుకునేటప్పటికి, ట్రైన్‌ అందదని, కౌంటర్‌లో ఉన్న అమ్మాయికి అక్రిడేషన్‌ చూపిస్తే, దయదలిచి రెండు టిక్కెట్లు ప్రసాదించింది. సిర్ పూర్‌ కాగజ్‌ నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ని అతి కష్టంగా అందుకున్నాం. కెమేరాబ్యాగ్‌ తల కిందేసుకొని మిత్రుడు నడుం వాల్చాడు.వెనక్కు పోతున్న మబ్బుల వైపు చూస్తున్నా… కాజీపేట్‌ రాగానే బండి ఫుల్‌ అయింది…
జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి….స్టేషన్లు దాటుతుంటే, ఇక్కడే పోగొట్టుకున్న నా బాల్యం గుర్తుకు వచ్చింది. (మంచిర్యాల పక్కనే మందమర్రి, కార్మెల్‌ స్కూల్‌లో చదివాను. ఆ ముచ్చట మరో సారి… ) పెద్దపల్లిలో దిగ గానే మిత్రుడు చారి కారుతో సిద్ధంగా ఉన్నాడు. దారిలో కనిపించిన హోటల్‌లో, కొత్తిమిర చట్నీతో ఇడ్లీలు తిని, కాకులగుట్ట, నాగుల గుట్ట తిరిగేటప్పటికి సాయంత్రం నాలుగైంది.లోపల ఆకలి, బయట, వాన దంచి కొడుతోంది ..
పెద్దపల్లిలో లావణ్య మెస్‌కి వెళ్తే , కర్రీస్‌ అన్నీ అయిపోయినయి, కాకర కాయకూర, పాలకూర పప్పు మిగిలిందన్నారు. ఈ సమయంలో ఇదే అద్భుతం, వెంటనే వడ్డించమన్నాం. చివరలో చిక్కని పెరుగును రుచి చూపించి, ఆ మెస్‌ని గుర్తు పెట్టుకునేలా చేశారు.
మళ్లీ చినుకులు మొదలైనయి… అక్కడి నుండి కరీంనగర్‌ బయలు దేరాం, ఒక బ్యాంకు అధికారితో మీటింగ్‌ తరువాత, రాత్రి రెండింటికి హైదరాబాద్‌ చేరుకున్నాం. ఈ ప్రయాణంలో మూడు జిల్లాలు టచ్‌ చేశాం, ఎంతో మందిని చూశాం. వారి మధ్య సంభాషణలు విన్నపుడు, ఇపుడున్న పరిణామాలపై, చాలా అసహనం కనిపించింది. ఎవరిని కదిలించినా తీవ్రమైన ఆగ్రహం… అంతకంటే విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉందా??

Share.

Leave A Reply