ఓటమే మీ విజయ రహస్యం

Google+ Pinterest LinkedIn Tumblr +

Failure Is the Seed of Growth and Success ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో గందరగోళం కారణంగా ఫెయిల్‌ ఐన విద్యార్థులు అనేక మంది పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటన మీడియా లో రోజు చూస్తున్నాము . మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు ఏదో అన్నారని,టీచర్లు ఏదో అన్నారని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.కొన్ని గణాంకాల ప్రకారం దాదాపు సంవత్సరానికి 5వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
విద్యార్థుల ప్రతిభ… చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులు , కుటుంబ పరిస్థితులు , స్నేహితులు , వీటి అన్నిటిమీద ఆధారపడి ఉంటుంది . విద్యార్థి ఫెయిల్‌ అయిన సమయములో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం, స్నేహితులు , బంధువులు ఎవరైనా భరోసా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ డిప్రెషన్‌ కు లోనై క్షణికావేశముతో ఏమి ఆలోచించకుండా విలువైన జీవితాలను ముగిస్తున్నారు. 
ఆత్మహత్యలు ఎందుకు? 
ప్రస్తుత సమాజంలో విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తున తల్లి దండ్రులు, కార్పొరేట్‌ విద్య సంస్థలు విద్యార్థులను ఇతరులతో పోలుస్తూ విద్యార్ధులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు .తల్లి దండ్రులు పిల్లల తెలివి తేటల కంటే ఎక్కువ ఆశించడం వలన , విద్యార్థులలో ఎదో సాదించాలి, ఎదో చేయాలి అనే తపన పెరిగి పోయి, దానిని సాధించగలమా లేదా అనే భయం తో విద్యార్థులు ఒత్తిడికి లోనై ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. 
పిల్లలను హాస్టల్‌ లలో చదివిపిస్తూ పండుగలకు ఫంక్షన్స్‌ కు పిల్లలని దూరం చేయడం వలన విద్యార్థులు మానవ సంబంధాలను మానవ విలువలను తెలుసుకోకుండా పెరుగుతున్నారు .తల్లి దండ్రులు మార్కులే ప్రామాణికంగా ఒక సబ్జెక్టు లో 80 మార్కులు వచ్చిన ఇంకా 20 మార్కులు ఎలా తగ్గాయి అని విద్యార్ధులపై ఒత్తిడి చేయడం నేటి సమాజం లో సాధారణమైంది. విశ్వంలో సష్టికి ప్రతిసష్టి చేయగల సత్తా ఉన్న మానవ మేధస్సు చిన్న చిన్న కారణాలకు కంగిపోయి నిరాశ నిస్ప హలతో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. నేటి సమాజములో తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు చదువు తప్ప వేరే జీవితము లేదు అన్నట్లుగా తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు . 
తల్లిదండ్రుల బాధ్యత : 
ఈ సమయంలో పేరెంట్స్‌ ఇచ్చే ఓదార్పు, ఆత్మీయమైన స్పర్శ చాల కీలక మైనది మేము ఉన్నాము అధైర్య పడొద్దు అని భరోసా కల్గించేలా సానుకూలంగా మాట్లాడాలి .కానీ నీవేం చేయలేవు నీ వళ్ళ కాదు అని ఇతరులతో పోలుస్తూ చులకనగా అసలు మాట్లాడకూడదు .విద్యార్థులు అధైర్య పడొద్దు అని పరీక్షలే ప్రమాణికం కాదని మానసిక ధైర్యం కోల్పోకుండా సమస్యని ఎదొర్కొన్నపుడే జీవితంలో ఎదుగుతామని ,నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు సాగినపుడే, విజయం సాధిస్తారని ,జీవితంలో విజయాలు వైఫల్యాలు సహజము అని అవగాహన కలిగించాలి. అన్ని జన్మల కంటే మానవ జన్మ విలువైనది అని, పిల్లలు శక్తి సామర్థ్యాలపై ఆత్మ విశ్వాసం కలిగేలా మాట్లాడాలి . 
విజయ గాధలు చెప్పాలి 
ఫెయిల్‌ ఐనా విద్యార్థులను తల్లిదండ్రులు తరుచు గమనిస్తూ ఉండాలి . చరిత్రలో అబ్రహం లింకన్‌ , థామస్‌ ఎడిసన్‌ , వివేకానంద, లాంటి మహానుభావులు ఓటమినుండి గెలుపొంది విజయం సాధించారని విద్యార్థులకు చెప్పాలి. ఫెయిల్యూర్స్‌ శత్రువులు కాదని నీ బలాన్ని , బలహీనతలను తెలియ చేసే మీ మిత్రులు మాత్రమే అని , సముద్రమంత నీరు కూడా ఓడను ముంచలేదు అలానే కొండత కష్టం కూడా మిమ్మల్ని ఏమి కదిలించలేదు అని లక్ష్య సాధనలో అడ్డంకులను ఎదుర్కొని ఫెయిల్యూర్స్‌ ని సానుకూల దక్పధంతో స్వీకరించేలా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి. 
విద్యార్థులారా ఆలోచించండి !! 
మనిషి జన్మ చాల విలువైనది. కాళ్ళు చేతులు వంకర లేకుండా చక్కగా పుట్టడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మీకు ఏ హక్కు ఉంది అని మీ జీవితాన్ని అర్దాంతరంగా ముగించడానికి, మీ జీవితం మీది, మీ కుటుంబానిది మాత్రమే కాదు సమాజానిది. ఎందుకంటే ఒక సమాజం మీ పైన పెట్టుకున్న నమ్మకం మనసు పెట్టి చదువుకో గలగడం. 
మీరు జీవితాన్ని ముగించడానికి ముందు, దాని వెనక మీ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మీ జీవితం కోసం తపించారు. సమాజం మీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగము చేయడానికి మీకు ఏ హక్కు ఉంది. గత పరీక్షలలో చేసిన పొరపాట్లను సరిదిద్దు కుంటూ ఉన్నత విద్యను, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నేటి ప్రపంచంలో చాల అవకాశాలు ఉన్నాయి .ఇవేమి ఆలోచించకుండా, మీరు విలువైన ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారు. 


ఓటమి కూడా జీవితంలో ఒక భాగం. 
ఓటమి అనేది అవకాశాలను సష్టిస్తుంది ప్రయత్నించండి ,ప్రయత్నం చేయకపోవడమే ఓడిపోవడము.ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఓడిపోయే జీవితంలో విజయం సాధించారు అని గుర్తించి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి .
ప్రతి చీకటి వెనక వెలుగు ఉంటుంది మీరు ధడ సంకల్పంతో ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ఈ ప్రపంచములో సర్వశక్తులు నీలో ఉన్నాయి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న అవకాశాలు స ష్టించుకున్న వాళ్లే విజయాలు సాధిస్తారు . మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోడానికి యోగ ,మెడిటేషన్‌ కూడా 
ఉపయోగపడతాయి. 
………………………………….. 
విజయలక్ష్మి, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ ( 7382665647)

Share.

Leave A Reply