అడివి,రమ్మని పిలుస్తోంది !!

Google+ Pinterest LinkedIn Tumblr +


అడవిలో సాహసాలను ప్రేమించే వారికి రైట్‌ ప్లేస్‌ తాడ్వాయి ఫారెస్ట్‌.
వరంగల్‌ నుంచి సరిగ్గా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆకుపచ్చని అరణ్యం.
ఇక్కడ అటవీ శాఖ వారి ఇకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన కాటేజీలు ఉన్నాయి.చుట్టూ దట్టమైన అడవి.మధ్యలో అందంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దిన కాటేజీలు.
” ఎప్పుడూ భూమ్మీదేనా? అప్పుడప్పుడూ ఆకాశంలోనూ నడవాలని కోరుకునే వారికోసం కొన్ని సాహస క్రీడల ఏర్పాట్లు కూడా ఈ ఏడాది చేశారు . భూమికి 20 అడుగుల ఎత్తులో వేలాడే వంతెన,సన్నటి ఇనుపతీగ మీద తాళ్ల సహాయంతో నడవటం (రోప్‌ రేస్‌)ఎలాంటి ఆధారం లేకుండా కేవలం తాళ్ల మీద నడవటం లాంటి సాహస క్రీడలు ఉన్నాయక్కడ. ట్రెక్కింగ్‌,సైక్లింగ్‌,కాంప్‌ ఫైర్‌ కూడా ఉన్నాయి….” అంటున్నారు ఇటీవల ఇక్కడ ఎంజాయ్‌ చేసి వచ్చిన సీనియర్‌ జర్నలిస్టు షేక్‌ సాధిక్‌.

ఇక్కడి నుండి కిలో మీటర్‌ దూరంలో పచ్చగడ్డి మైదానాలు ,రెండు కిలోమీటర్ల దూరంలో బ్లాక్‌ బెర్రీ ఐలాండ్‌ ఉన్నాయి.నైట్‌ పార్టీలు చేసుకునే వారికోసం ఐతే ఇక చెప్పనక్కరలేదు.డ్రీమ్‌ డిస్టినేషనే.యూత్‌,కిడ్స్‌,ఫ్యామిలీస్‌ అందరినీ అలరిస్తుంది ఈ అడవి.

ఇక్కడి నుంచి 40 కిలో మీటర్ల దూరంలోనే బొగత జలపాతం ఉంది . కాటేజీల బుకింగ్‌ ఆన్‌లైన్‌లో చేసుకోవాలి . మరో రెండు నెలల వరకు శని,ఆదివారాలు హౌస్‌ ఫుల్‌ .సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో మాత్రమే కాటేజీలు అందుబాటులో ఉన్నాయి .వర్కింగ్‌ డేస్‌ లో శ్రమ అనుకోకుండా రెండు రోజులు సెలవు పెట్టుకోగలిగితే జీవితాన్ని ఆహ్లాదంగా గడపొచ్చు .
మరిన్ని వివరాలకు అక్కడి మేనేజర్‌ సాయిక్రిష్ట ను సంప్రదించండి.
ఫోన్‌ :95533 82636

Share.

Leave A Reply