గ్రామీణ సమాజ వికాస కేంద్రం. టెన్తో, ఇంటరో చదివి , అనేక కారణాలతో ఆగిపోతారు. ఆ తరువాత భవిష్యత్ మీద బెంగతో సెల్ ఫోన్లో మనశ్శాంతి వెతుక్కుంటూ తిరుగుతుంటారు. ఇలాంటి వారి కోసమే #CCD,Varni ఏర్పాటయింది. ఉచితంగా ఫుడ్,బెడ్‌తో పాటు ఆహ్లాదమైన పచ్చదనం మధ్య, వారి నైపుణ్యాన్కి మెరుగులు దిద్ది, ఉద్యోగం ఇచ్చి సమాజానికి భారం కాకుండా చూస్తున్నారు.( more details for contact- 8978239978)
పెద్ద చదువులు లేక పోయినా ఉపాధి పొందవచ్చు. జీవితంలో నిలదొక్కుకోవాలనే లక్ష్యశుద్ది ఉంటే చాలు,అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తోంది, నిజామాబాద్ జిల్లా, వర్ని గ్రామంలోని #CCDVarni . తెంగాణ లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, బతుకు తెరువు చూపించి, వెలుగుబాట వేస్తున్న విజయ గాథ ఇది. మాదాల ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్దికి ప్రగతి మార్గం చూపింది సీసీడివర్ని. మారుమూల పల్లె ప్రజల ఉపాధి,జీవనోపాధుల మెరుగుద కోసం, వైద్యం,విద్య, క్రీడా నైపుణ్య శిక్షణతో నిజమైన గ్రామస్వరాజ్యం అనే లక్ష్యంతో పచ్చని ప్రకృతి,కొండల మధ్య ఐదున్నర ఎకరాల్లో 2014లో #CCD ని ఏర్పాటు చేశారు. https://youtu.be/nZGIW-30HzU