కరువు నేలలో …. వెలుగు బాట
…………………….
దాహం తీర్చుకుందామంటే చుక్క నీరు లేదు.
ఊరికి సరైన రహదార్లు లేవు. పిల్లలకు స్కూల్ లేదు. ఉన్నా వారికి పుస్తకాలు కొనే స్తోమతు లేదు. రోగం వస్తే ఆసుపత్రి లేదు.
ఇదంతా గతం… .
నేడు అక్కడి దృశ్యం మారిపోయింది.
ఇపుడక్కడ ప్రతీ ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్.
అక్కడి ప్రజలకు కరెంట్ బిల్లు రాదు. ఎందుకంటే…
ప్రతీ ఇంటికి విద్యుత్ ఉచితం.
బడిలో పిల్లలు బల్లల పై కూర్చుని చదువుకుంటారు. వారికి పుస్తకాలు ఉచితం.
పండగలొస్తే అన్ని కుటుంబాలకు ఉచితంగా కొత్త దుస్తులు.
ప్రతి ఇంట్లో ఆధునిక టాయిలెట్లు
చదువుకున్న యువతకు ఉద్యోగాలు…
ఊరంతా విద్యుత్ వెలుగులు పంచే సోలార్ ప్లాంట్.
అందరికీ స్వచ్ఛమైన జలం అందేలా ఆర్వోప్లాంట్లు…
ఏమిటిదంతా సినిమా కథలా ఉందా..?
కానేకాదు. మీరిది చదువుతున్నంత నిజం.
అది తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాలోని
ఒక మారుమూల పల్లె. ఆ చీకటి పల్లెలో వెలుగుల వెనుక ఓ యువకుడి కృషి ఉంది.
జన్మభూమి రుణం ఎలా తీర్చుకోవాలో తెలియ చెప్పిన అపూర్వ ప్రగతి చిత్రం.
ఆర్ధికంగా ఎదిగిన ప్రతీ మనిషి తన పల్లెలను ప్రేమిస్తే…ప్రతి ఊరు సింగ పూర్ కాదా..?
ఇపుడు కావాల్సింది స్మార్టు సిటీలు కాదు, స్మార్టు విలేజీలు అని తెలియ చెప్పిన అపూర్వ కథనం ఇది.
రూరల్మీడియా టీం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది.
అతి త్వరలో మీ ముందుకు వస్తోంది.
కరువు నేలలో ….వెలుగు బాట
Share.