మల్బరీ సాగు’తో కరువుకు చెక్‌!

Google+ Pinterest LinkedIn Tumblr +

కరువు పీడిత ప్రాంతాల్లో మల్బరీ సాగు ద్వారా పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు చక్కని ఆదాయం పొందుతున్నారు. నీటిని తక్కువగా వాడుకునే పద్ధతులను వెతుక్కునే క్రమంలో ‘ట్రీ మల్బరీ’ పద్ధతి ముందుకు వచ్చింది. ఎకరానికి 650 మల్బరీ చెట్లను తక్కువ నీటితోనే సాగు చేయడం ఈ పద్ధతి ప్రత్యేకత.
కరీనగర్‌ జిల్లా, కాటారం,నల్గొండ జిల్లా, మోత్కూరు మండలాల్లో గత కొన్నేళ్లుగా వర్షాలు తగ్గాయి. కరువు తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడి రైతులు ప్రేమ్‌కుమార్‌,యాదయ్య నీటి ఎద్దడిని తట్టుకొనేందుకు మల్బరీ మొక్కలను పెంచే కొత్త పద్ధతిని గత మూడేళ్ల నుంచి చేపట్టారు. . సాధారణంగా మల్బరీ చేలల్లో సాళ్ల మధ్య రెండు అడుగులు, మొక్కల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి అధిక సాంద్రతలో సాగు చేయడం రైతులకు అలవాటు.
మొక్కలు నాలుగు అడుగుల ఎత్తు పెరిగే లోపే కట్‌ చేసి ఆకులను పట్టుపురుగులకు మేతగా వేసేవారు. ఆ మొక్కలకు మళ్లీ ఎరువులు వేసి నీటిని అందించి తదుపరి పంటకు సిద్ధమయ్యేవారు. ఈ క్రమంలో వారానికోసారి మల్బరీ పంటకు నీటిని అందివ్వాల్సిందే. నీటి తడులు ఏమాత్రం ఆలస్యమైనా పంట ఎండిపోయేది. దీనికి భిన్నంగా ఈ రైతులు
మల్బరీ మొక్కలను పెద్ద వ క్షాలుగా పెంచే కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. అధిక సాంద్రతలో సాగుచేసే మల్బరీ తోటలో సాళ్ల మధ్య అంతర పంటలను సాగు చేసేందుకు వీలుండదు. కానీ, మల్బరీ చెట్ల మధ్యలో కొత్తిమీర, జొన్న, వివిధ రకాల ఆకుకూరలు, పశుగ్రాసం తదితర అంతర పంటలను సాగు చేసుకోవచ్చు.
మూడేళ్ల తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు..
”నాలుగు ఎకరాలో మల్బరీ చెట్లు పెంచుతున్నాం. ఎకరానికి 700 మొక్కలను, 3 అడుగుల లోతులో నాటాము. 3 ఏళ్ల వరకు డ్రిప్‌తో నీరిస్తే తర్వాత నీరివ్వకపోయినా పర్వాలేదు. ఈ చెట్లు పదేళ్ల వరకు మల్బరీ ఆకు దిగుబడినిస్తాయి.” అంటారీ రైతులు.
ఇవీ ఫలితాలు
1, పత్తి, మొక్కజొన్న పండే ప్రాంతాల్లో మల్బరీ పండించడం వల్ల వీరు సాగునీటిని పొదుపు చేస్తున్నారు. మిగతా పంటల అవసరమైనంత ఎరువులు,నీరు కూడా మల్బరీ కి అవసరం లేదు. చీడ,పీడల సమస్యలు లేవు
2, ఎకరానికి 650 మల్బరీ చెట్లు పెంచితే చాలు..మూడేళ్ల తర్వాత నెలకోసారి నీరిస్తే చాలు
3, ఇతర పంటల సాగులో వాడే నీటిలో 10 నుండి 15 శాతం నీటితోనే మల్బరీ తోటలు సాగు చేసుకోవచ్చు.
కరువు పీడిత ప్రాంతాల రైతులకు ఈ సాగు ఎంతో ప్రయోజనం

Share.

Leave A Reply