Case Study|ఆభివృద్ధి ఆకాశం నుండి ఊడి పడదు…

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయనగరం నుండి 140 కిలో మీటర్ల దూరంలోని, గుమ్మలక్ష్మీపురం దాటి, సదునుగూడ చేరుకునేటప్పటకి మధ్యాహ్నం 2 దాటింది.అక్కడ 60 వరకు గడపలు ఉన్నాయి. చిన్న పిల్లలు మేకల వెంట పొలాల్లో తిరుగుతున్నారు. నరేగా ప్రాజెక్టు మీద కేస్‌ స్టడీ చేయాలి కానీ, ఆ రోజు మా పని అయ్యేలా లేదు. పెద్దవాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఓ గంట సేపు జీడిమామిడి తోటల్లో తిరిగి జీడిపండ్లు రుచి చూశాం. ” అందరూ పక్క ఊరు వెళ్లారంట, ఇంకో రోజు పెట్టుకుందాం..” అని మాతో వచ్చిన ఫీల్డ్‌ ఆఫీసర్‌ చెప్పడంతో వెనక్కు తిరిగాం…

ఇంతలో… తలపైన బియ్యం మూట, చంకలో చంటిబిడ్డతో ఒకామె నడచు కుంటూ గ్రామంలోకి వచ్చి నెత్తిమీద బరువును ఒక అరుగు మీద దించి, కొంగు తో చెమటలు తుడుచు కుంది .ఆమె దగ్గరకు వెళ్లి మేం వచ్చిన సంగతి చెప్పాం. ” ఈ రోజు ఎవరూ ఉండరండి … రేషన్‌ బియ్యం, సరుకులు ఇస్తున్నారు, ఇక్కడికి చాలా దూరం . తెచ్చుకోవడానికి వెళ్లాం. దీని వల్ల ఈ రోజు కూలీ కూడా పోయిందయ్యా… ” అని చంటి బిడ్డకు పాలివ్వ సాగింది. మూడేళ్ల క్రితం చూసిన గ్రౌండ్‌ రియాలిటీ ఇది. రోజుకు కనీసం రూ. 200 కూలీ చొప్పున ఇంతకాలం,ఎన్ని లక్షల పనిదినాలను పేదలు కొల్పోతున్నారో లెక్కలు తీస్తే అది మరో కేస్‌స్డడీ అవుతుంది!! కాబట్టి పేదోళ్లకు ఇళ్లను ఇస్తున్నారని, ఇంటికే రేషన్‌ సరుకులు పంపుతూ బద్దకాన్ని పెంచుతున్నారని… ఏడ్వకండి.

ఆభి వృద్ధి ఆకాశం నుండి ఊడి పడదు.పేదలు స్వయం సమృద్ధి అవ్వడమే అభివృద్ది . ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక సామాజిక మార్పు మొదలైంది!! రేషన్ సరుకులను, పింఛన్ లను పేద వాడి ఇంటికి చేర్చడం దేశం లో ఎక్కడైనా ఉందా.?

Share.

Leave A Reply