” భరోసా లేని బతుకులు మావి.. ”

Google+ Pinterest LinkedIn Tumblr +

శవాల మధ్య జీవచ్చవాలుగా, బ్యాగరీమహిళలు 
…………………………………………………………….. 
మెదక్‌ పాతబస్‌స్టాండ్‌ దగ్గర నుండి కిలో మీటరు దూరంలో గిద్దకట్ట సమీపంలో గుట్టల మధ్య ఉన్న చిక్కని అడవిలాంటి స్మశాన వాటికలోకి మేం అడుగు పెట్టగానే నలుగురు మహిళలు బొంద తవ్వుతూ కనిపించారు. చనిపోయిన వారి అంత్యక్రియలు జరపడమే వీరి జీవనోపాధి. ఇది బ్యాగరి మహిళలకు తరతరాలుగా వచ్చిన కుల ఆచారం. 
” అసుపత్రుల దగ్గర అనాధ శవాలను తీయాలన్నా మేమే పోవాలి. కుళ్లిన శవాల దగ్గరకు మమ్మల్నేపిలుస్తరు, మా బతుకంతా శవాల మధ్యనే… భరోసా లేని బతుకులు మావి.. ” అని గోతిని తవ్వడం ఆపకుండానే చెప్పింది బ్యాగరి లచ్చిమి. 
వీరంతా తమను తాము బ్యాగరోళ్లుగా చెప్పుకుంటారు. ఇక్కడి ప్రజలు కూడా అలాగే పిలుస్తారు. గిద్దకట్టలోని స్మశాన వాటిక సమీపంలో ఆరు కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో పన్నెండుమంది మహిళలకు అంత్యక్రియలు జరపడమే వృత్తి. 
అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ వీరే పూర్తి చేస్తారు. ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు…. అవసరమైన సామాగ్రినంతటినీ సిద్ధం చేసుకుంటారు. బంధువులు శవానికి తలకొరివి పెట్టి వెళ్లిపోతారు. మిగతా పనంతా ఈ ఆడవాళ్లే దగ్గరుండి చూసుకుంటారు. ఇంత చేస్తున్నా వీళ్లకు నెలకు దక్కేది కేవలం రూ.2 వేలు కూడా ఉండదు. అంత్య సంస్కారాలకు వచ్చిన మతుని వైపు వారు ఏమైనా ఇస్తే ఇవ్వవచ్చు లేదా వెళ్లిపోవచ్చు..గ్యారంటీ లేదు అని వీరంటారు.  full story …https://www.bbc.com/telugu/india-45238079

Share.

Leave A Reply