హీరోయిజం అంటే…?

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరోయిజం అంటే తెరమీద-
పశువుల్లా మేసి కండలుపెంచుకుని వందలమందిని ఒంటిచేత్తో కొట్టినట్లు నటించడం కాదు. ఈ దేశంలోని మట్టికోసం, మనిషికోసం పేజీలకొద్దీ డైలాగులు చెప్పడం కాదు.

హక్కులకోసం, రాజ్యాంగ విలువలకోసం నిలబడిన విద్యార్థులమీద పాశవికంగా గూండాలు దాడిచేస్తే, జాతి యావత్తూ ఎద నలుపుకుని బాధపడుతోంటే మీరు మాత్రం “అల వైకుంఠపురంలో” తేలియాడుతూ “సరిలేరు నాకెవ్వరు” అని జబ్బలు చరుచుకుంటూ, స్టేజీల మీద మీ యవ్వనాల ప్రేమల్ని ముదిమి శరీరాలమీద గుర్తుతెచ్చుకున్నప్పుడు, మీ తాత తండ్రులకు పద్మశ్రీలు డిమాండ్ చేసినప్పుడు.. ఒక్క క్షణమైనా గతరాత్రి దేశరాజధానిలో మనకోసం నెత్తురోడిన వీరత్వాలు గుర్తురాలేదా!

కనీసం ఒక్క క్షణం మౌనంగా వాళ్లని తల్చుకున్నారా? కులాల్ని చూసి, గొర్రెల్లాంటి అనుచరుల కేరింతల్ని చూసి మురిసే మీరు హీరోలైతే, మరి సగటున మీకన్నా రెట్టింపు అభిమానులున్న అలియాభట్, తాప్సీ, ట్వింకిల్, దీపికా వంటివాళ్లనేమనాలి? సగటు మనిషికుండే స్పందనలు కూడాలేని మీరు హీరోలెట్లైతిరి? మీదికాని ఏ ప్రతిభచూసి అభిమానులు మీకు బానిసలైరి? – Siddharthi Subhas Chandrabose

Share.

Leave A Reply