ఎంపీగా, దినసరి కూలీ కూతురు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల సభ సందడిగా ఉంది. 
చెరగని చిరునవ్వుతో 32 ఏళ్ల అమ్మాయి మైక్‌ అందుకుంది.తనను గెలిపిస్తే ఏమి చేస్తానో చాలా క్లుప్తంగా చెప్పి, ఒక పాట అందుకుంది. మళ్లీ కాసేపు మాటలు. పాటలు,మాటలతో ప్రజాభి మానం పొందుతూ, అంతులేని ఉషారుతో ఎన్నికల ప్రచారం చేసిన ఆమె రమ్యహరిదాస్‌. 
క షి, పట్టుదల, ఉంటే సామాన్యులు విజేతలవ్వొచ్చు అని నిరూపించారు రమ్య హరిదాస్‌. పేదరికంలో పుట్టి దేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంట్‌ వరకు ఎదగగలిగారంటే మామూలు విషయం కాదు. 
ఒక సాధారణ దినసరి కూలీ కూతురు కమ్యూనిస్ట్‌ కంచుకోటలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేరళ నుంచి ఎన్నికైన ఏకైక దళిత మహిళా ఎంపీ రమ్యనే కావడం విశేషం. 
ఆమె ప్రత్యర్ది సంపన్నుడు, లెఫ్ట్‌ అభ్యర్ది, 2009 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతోన్న సీసీఐఎం నేత పీకే బిజూను ఓడించి, లక్షన్నర ఓట్ల మెజారీటీతో ఈ పేద అమ్మాయి విజయబావుటా ఎగరేసింది. 
2010లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ యువ నాయకత్వం కోసం సాగించిన అన్వేషణలో దళిత సామాజిక వర్గానికి చెందిన 32 ఏళ్ల రమ్య హరిదాస్‌ రాహుల్‌గాంధీని ఆకర్షించారు. మంచి వాగ్ధాటి, విషయాలపై అవగాహన, సామాజిక చైతన్యం, దళితుల సంక్షేమం వంటి అంశాలపై మంచి పట్టు ఉన్న రమ్యని రాహుల్‌ రాజకీయ తెరపైకి తెచ్చారు. 
రమ్య రోజు కూలీ చేసుకుని బతికే దళిత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి హరిదాస్‌ కోజికోడ్‌ జిల్లాలోని కున్నామంగళమ్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. 
రమ్య ఆదివాసీలు, దళితుల సమస్యలపై అవగాహనను పెంచుకుని, యువతకు వివిధ అంశాలపై శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. 
పేదరికం, నిరుద్యోగం, మహిళల సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడుతానని అంటున్నారు.

Share.

Leave A Reply