ఎనీ టైమ్‌… శీతాఫలమ్‌ !!

Google+ Pinterest LinkedIn Tumblr +

  

  తెల్లవారు జామునే అడవుల్లోకి గంపలతో బయలు దేరతారు . గుట్టల మధ్య పొదల్లో పెరిగిన చెట్లను ఎక్కి , పచ్చగా విచ్చుకుంటున్న పండ్లను తెంపి బుట్టలో వేసుకొని వాటిపై ఆకులు కప్పి, తెచ్చుకొని,  రోడ్ల పక్కన  అమ్ముకుని జీవించడం ఈ ప్రాంతపు  పేదమహిళల జీవన చిత్రం.

నారాయణ పేట జిల్లా,  తిరుమలాపూర్‌ అడవుల్లో మాకు కనిపించిన  దృశ్యం ఇది.

 ‘‘ దాదాపు పది కిలో మీటర్లు  నడిచి, అడవిలో సేకరించిన సీతాఫలాను, ఏదో ఒక ధరకు  అమ్మేసి నష్టపోయే వాళ్లం. ఒక్కో సారి బస్తా పండ్లుకు 30 రూపాయలు కూడా వచ్చేవి కాదు.. ఇలా కాదని,  అందరం  కలిసి  ‘నారాయణపేట ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ ’ గా ఏర్పడ్డాం. ఇపుడు మేం సేకరించిన పండ్లకు గిట్టుబాటు ధరను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దూరప్రాంతాలకు మోసుకుంటూ పోయి అమ్ముకునే శ్రమ తప్పింది… దీనికి తోడు పండ్ల నుండి గుజ్జు తీసి , మరి కొంత ఆదాయం పొందుతున్నాము   ’’ అంటారు, ఎన్‌.ఎఫ్‌.పి.ఓ. ఛైర్మన్‌  రేణుక. పూర్తి కథనం AndhraJyothi  లో చదవండి.

13.12.2020.andhrajyothi
Share.

Leave A Reply