అనంతపురంలో కోవిడ్ కేర్‌ సెంటర్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

నిండు కుండ తొనకదు.. ఎక్కడా ప్రెస్ మీట్లు లేవు, అధిరి పోయే ప్రకటనలు లేవు. చాలా సైలెంట్గా, అతి మామూలుగా ఏపీలో ఒక అత్యవసరమైన, అరుదైన నిర్మాణం జరుగుతోంది.
మానవత్వం పరిమళిస్తూంది, ప్రభుత్వం ప్రజల పట్ల దయ తో ప్రేమ తో స్పందించింది .
చైనాలోని వుహాన్ లో కేవలం ఆరు రోజుల్లోనే వేల పడకల సామర్థ్యం గల ఆస్పత్రిని నిర్మించారు. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం 1,500 పడకల సామర్థ్యంతో కోవిడ్ కేర్ సెంటర్ను అనంతపురం నగర శివారులోని రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఏర్పాటు చేస్తోంది. పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

మొత్తం 12 బ్లాక్ లు.
మహిళలకు ప్రత్యేకంగా రెండు బ్లాక్లను కేటాయించారు. కోవిడ్ బాధితులకు సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు అక్కడే విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఉండేందుకు పురుషులు, మహిళలకు వేర్వేరుగా అన్ని వసతులతో షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
వంట తయారు చేసి పెడతారు..
ప్రభుత్వం మెనూ ప్రకారం పేషంట్లకు భోజనం అందించేందుకు ప్రత్యేకంగా వంట గదినే ఏర్పాటు చేశారు. భోజనం చేసేందుకు వీలుగా హాల్ బయట టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్లో విద్యుత్, నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రోగుల కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ మొత్తం 180 నిర్మిస్తున్నారు. ‘’ రామినేపల్లి వద్ద ఉన్న గోదాముల్లోని ఒక్కో బ్లాకుకు 125 పడకలు చొప్పున 12 బ్లాకుల్లో 1,500 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పేషంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులతో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాం.  పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు  సమీక్షిస్తున్నాం.  ‘’ అని  కలెక్టర్  గంధం  చంద్రుడు రూరల్ మీడీయ కు ఫోన్ లో వివరించారు .

Share.

Leave A Reply