భారతీయులకు ముప్పు లేదా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

భారతీయులకు పాశ్చాత్య దేశాల వారి స్థాయిలో కరోనా ముప్పు ఉండదు అనే విషయాన్ని శాస్త్ర వేత్తలు మెల్లమెల్లగా గ్రహిస్తున్నారు . ఒప్పుకొంటున్నారు. ఒక్కొక్కరూ తమదైన వివరణ తో ముందుకు వస్తున్నారు . ఒకాయన బుజం పై ఉన్న మచ్చ { బీసీజీ టీకా } రక్షించింది అంటాడు. అయ్యా మరి మిగతా మలేరియా దేశాల సంగతి ఏంటి అని అడగరు . అయన ఇంటర్వ్యూ ను ఫుల్ పేజీ వేస్తున్నారు . మరొకాయన మట్టి లో ఆదుకోవడమే భారతీయులను రక్షించింది అంటాడు . మరి సింగపూర్ లాంటి దేశాల సంగతి ఏంటి . వారు కూడా పాశ్చత్య దేశాల వారి లాగా అతి శుభ్రత పాటిస్తారు కదా అని అడగరు . అయన అభిప్రాయాన్ని ప్రముఖంగా ప్రకటిస్తారు .

అసలు లోకమంతా భయం తో వణికి పోతుంటే .. ఒక్కే గొంతు .. ఒక్కే ఒక్క గొంతు .. భారతీయులకు ఆ స్థాయిలో ముప్పు లేదని గట్టిగా చెప్పింది . శాస్త్రవేత్తలు అనబడే వారు ఇప్పుడు నిద్ర లేస్తుంటే .. పది రోజుల క్రితమే దీని గురించి స్పష్ట మైన వివరణ తో ముందుకు వచ్చింది . అప్పటినుంచి ఇందుకు ఆధారాలు ఇవిగో అని ప్రతి రోజూ పుంఖానుపుంఖాలుగా ముందుకు తీసుకొనివస్తోంది . ఫేస్బుక్ మిత్రులు మినహాయించి దీన్ని పట్టించుకొన్న నాథుడు లేదు .

అడిగితె .. మీది రుజువు కానీ సిద్ధాంతం అంటున్నారు . మరి మట్టి లో ఆదుకోవడం , బీసీజీ ఇంజక్షన్ వల్ల కరోనా నుంచి రక్షణ వస్తోందని రుజువు అయ్యిందా ? లేదు కదా ? మరి వారి అభిప్రాయాలను అంత ప్రముఖంగా ప్రచురించడం ఎలా సాధ్య పడిందో ? కనీసం ఇలా వ్యక్తి వున్నాడు .. ఇలా అందరికి కంటే ముందు ఏదో సిద్ధాంతం అంటూ ముందుకు వచ్చాడు .. తన వాదనకు బలంగా ఇదిగో రోజూ ఇలాంటి డేటా ఇస్తున్నాడు అంటూ చెప్పొచ్చుగా ? లేదు .. జరగదు ..

ఎదో ఒక స్కూల్ నడుపుకునే వాడు .. సాధారణ జీవనం గడిపేవాడు .. ఇలా ప్రపంచానికి కారు చీకటి లో కంటి రేఖ లా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని చెప్పేస్తే .. అమ్మో ఇంకేమైనా వుందా ? వీడికి అంత క్రెడిట్ ఇచ్చేస్తే ఎలా ? మనకు తెలియని .. ఎవరో గడ్డం మేధావి చెబితే అది సిద్ధాంతం అవుతుంది . లేక పొతే అది రాద్ధాంతం అవుతుంది . రెండు రోజులకు ఎవరో ఒక మేధావి ఇదిగో ఇలా మలేరియా దేశ వాసులకు కరోనా నుంచి రక్షణ వుంది అని నేను కనిపెట్టాను అని చెబితే అప్పుడు అతనికి మొత్తం క్రెడిట్ అతనికి ఇచ్చేస్తే పోతుంది . వీడు చెప్పిన విషయాలు వాడి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అనే చిన్న సర్కిల్ కు పరిమితం అయిపోతుంది .

వాసిరెడ్డి అమర్నాథ్ కు ఎవరూ గాడ్ ఫాథర్స్ లేరు .. రాజకీయ నాయకుల వెనక చేరి చంచాగిరి కొట్టడు. కులం మతం ప్రాంతం అనే కనెక్షన్స్ ని అసలు వాడుకోడు . ఏదో తన పని .. తానూ .. ఆలా ముందుకు వెళుతుంటాడు . అందరూ భయాందోళనలకు గురవుతుంటే .. అసలు దీని వల్ల ఈ స్థాయిలో ముప్పు ఉందా ? అని నిశిత పరిశీలన చెయ్యడం మొదలు పెట్టా. మెడికల్ ఆంథ్రోపాలజీ పరిజ్ఞానం ఇక్కడ బాగా ఉపయోగ పడింది . స్పష్టమైన ఆధారాలు కనిపించడం తో .. ముందుకు వచ్చాను . ప్రజల భయాందోళనలు తగ్గించడమే నా లక్ష్యం . ఆందోళన అనవసరం . అప్రమత్తతే మనకు శ్రీరామ్ రక్ష .. ఇంట్లో వుండండి .. కర్ఫ్యూ నిబంధనలు పాటించండి అని ముందుకు వచ్చా .. ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చా.

నాకేదో బిరుదులూ , అవార్డు లు రివార్డ్ లు ఇస్తారని ఆశించలేదు . ఇప్పటికి గత పదహైదు ఏళ్లలో కనీసం ముప్పై సన్మానాలు . శాలువాలు .. బిరుదులూ లాంటి ఆఫర్స్ ని నిర్ద్వందంగా తిరస్కరించా. సింపుల్ లైఫ్ గడపడం నాకు ఇష్టం . అపుడే చెప్పా .. 15 ఏప్రిల్ తరువాత నేను .. నా పలక బడి .. అదే నా ప్రపంచం ..

అలాంటప్పుడు ఇదేంటి అసంతృప్తి ? గుర్తింపు కోసం ఆరాటం కదా ? మీరు అడగ వచ్చు . కాదు . లోకం పోకడ నాకు తెలుసు.. మనకు తెలిసిన వాడికి పేరు వస్తే మనం తట్టుకోలేము . ఇది నాకు బాగా తెలుసు . నా బాధ అందుకు కాదు . ఇప్పుడు కోవిద్ 19 ను ఎలా ఎదుర్కోవాలో .. నా దగ్గర స్పష్టమైన ప్రణాళిక వుంది .. దీన్ని నేను ఫేస్బుక్ లాంటి వేదిక ల పై పోస్ట్ చెయ్యలేను . మీడియా గనక నేను చేస్తున్న కృషి ని గుర్తించి ఉంటే .. ప్రభుత్వం నా సూచనలు వినడానికి సిద్ధ పడేదీ. వీడెవడో ఏదో చెబుతున్నాడు .. ఒక సారి వినండి .. వింటే నష్టం లేదు కదా ..ఆ అంటూ పాలసీ మేకింగ్ అధికారుల్ని అడిగివుండేది . ఇప్పుడు ఆ అవకాశం లేదు . నా వ్యక్తిగత సంబంధాలను ఉపయోగించుకొని నేను అక్కడి వెళ్లి ఇదిగో ఇలా చెయ్యాలి అని చెప్పడం చాల అసహ్యం గా ఉంటుంది . పిలవని పేరంటానికి వెళ్లి నట్టు ఉంటుంది .

ఇలా చెయ్యండి అంటూ ఫేస్బుక్ పై పోస్ట్ చేస్తే .. అది ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్ లాగా అనిపించవచ్చు . ఆలా చెయ్యడం నాకు ఇష్టం లేదు . 21 రోజుల కర్ఫ్యూ ను నేను పూర్తిగా సమర్థిస్తాను . ఏప్రిల్ 15 తరువాత ఏమి చెయ్యాలి అని విషయం లో నా వద్ద నిర్దిష్ట ప్రణాళిక వుంది . నేను కోరుకొనెదల్లా .. పాలసీ మేకర్స్ గా ఉన్న అధికారులు నా సూచనలను ఒక్క సారి ఆలకించడం . ఆ విధంగా మన దేశానికీ ఎన లేని మేలు జరుగుతుంది . ప్రభుత్వాన్ని విమర్శించే ఉద్దేశాలు .. రాజకీయాలు చేసే ఉద్దేశాలు .. నాకు ఏ కోశానా లేవు . నా విజ్ఞానం నలుగురికి ఉపయోగ పడాలి అని ఆరాటం ఒక్కటే .

అబ్బో . .. దేశం లో మేధావులు లేరా .. వారికి తెలియదా ? ఎక్కడో ఉన్న నువ్వు చెప్పేదేంటి అని ఎవరైనా అడగొచ్చు . మీడియా గనుక ఇదిగో ఈ వ్యక్తి ఇలా అందరి కంటే ముందుగా ఇలా చెప్పాడు .. ఒక పక్క శాస్త్ర వేత్తలు సునామి రానుంది .. శవాలు హిమాలయ పర్వతాల ఎత్తు లేవనున్నాయి అని వెస్ట్రన్ దేశాల మోడల్స్ ను చూపి మిలియన్ లెక్కలతో అమెరికన్ యాసలో బయపెడుతుంటే .. తొలి సారిగా ఇదిగో ఈయన ఇలా చెప్పాడు . దీని గురించి ఇంత విస్తృత అవగహన వుంది అని మీడియా హైలైట్ చేస్తే .. అధికారులు నా మాట లు వినడానికి కనీసం పది నిముషాలు కేటాయిస్తారు .

అదే నా ఆరాటం . ప్రతిభ ను గుర్తించే మంచి తనం ఇంకా లోకం లో చచ్చి పోలేదు .. ఇంకా అక్కడక్కడా మిగిలే వుంది .. చూద్దాం .. ఏమి జరుగుతుందో చూద్దాం .. (Amarnath Vasireddy)

Share.

Leave A Reply