ప్రజల రక్షణే పోలీసుల లక్ష్యం!!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్టోబర్‌ 15 నుండి 21 వరకు పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల లో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. రామగుండం పోలిస్‌ కమిషనరేట్‌ పరిధి లోని పెద్దపల్లి జిల్లాలో పోలిస్‌
అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, స్ధూపానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదికారులు మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితంగానే నేడు సమాజంలోని ప్రజలంతా విద్రోహ శక్తుల బారిన పడకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలకు పోలీస్‌ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగేలా, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న
కషి ఆమోఘమని అన్నారు. ప్రజల రక్షణ లో భాగంగా విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలను అర్పించారని వారికి నివాళులర్పించారు. ప్రజలు కూడా సంఘ వ్యతిరేక శక్తులకు సహకరించకుండా శాంతియుత వాతావరణం కొనసాగడానికి పోలీసులకు సహకరించాలన్నారు. ప్రజలు తమ ప్రాణ,మాన, ఆస్తి రక్షణకై ప్రాణ త్యాగం చేసిన వారికి ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ,వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share.

Leave A Reply