సెరికల్చర్‌లో సిరులు

Google+ Pinterest LinkedIn Tumblr +

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకట్రమణారెడ్డి నేడు సెరికల్చరిస్ట్‌గా మారి పూర్తిగా సెరికల్చర్‌నే జీవనోపాధిగా చేసుకున్నారు. ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. సాధారణ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి అవసరాన్ని బట్టి సెరికల్చర్‌ను చేసే రోజులనుండి నేడు సెరికల్చర్‌నే జీవనోపాధిగా మార్చుకొని ముందుకు సాగుతున్నారు. కొకూన్‌ ఉత్పత్తే కాకుండా, వెంకట్రమణారెడ్డికి మూడు మౌన్టింగ్‌ హాల్స్‌ ఉన్నాయి. వాటిని సెరికల్చర్‌ రైతులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. చిత్తూరు జిల్లా,పలమనేరు మండలానికి చెందిన ఈ రైతు జీవనం … స్ఫూర్తి దాయకం.
వెంకట్రమణారెడ్డి తండ్రి రెండున్నర ఎకరాలలో వరి, టమాట, మిర్చి సాగు చేసేవారు. కొంత భూమిలో మల్బరి సాగుచేసేవారు. భూమిలో నీటి నిల్వలు క్షీణించడం వల్ల బోర్‌ ప్రయత్నం విఫలమైయింది. కేవలం వర్షాధారిత పంటలు సాగుచేస్తూ ఖరీఫ్‌ కాలంలో రెండు పంటలు సాగుచేస్తూ నష్టాలు వచ్చినా, మరో దారి లేక మల్లీ అదే చేసేవారు. వారి వ్యవసాయ క్షేత్రంలో మల్బరిసాగు నీటికొరతను తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చేది. ఇక సెరికల్చర్‌ మాత్రమే సరైన పని అని గమనించి సెరికల్చరిస్ట్‌గా మారారు వెంకట్రామారెడ్డి. 
లాభాల పంట 
2000 స||లో వెంకట్రామారెడ్డి సెరికల్చర్‌ ప్రారంభించి, డిపార్ట్‌మెంట్‌ వారి ప్రోత్సాహంతో వారి కార్యక్రమాలలో పాల్గొని, 25 సెంట్ల మల్బరీ తోటను 2001 సం||లోకల్లా 2.5 ఎకరాలలో విస్తరించి, మల్బరి సాగుచేసేవారు. డిపార్ట్‌మెంట్‌ నుండి రూ. 25,000 ఆర్థిక సహాయంతో షెడ్డును నిర్మించుకున్నారు 
నేడు వెంకట్రామారెడ్డి ఒక సంవత్సరంలో 9-12 దఫాలలో కొకూన్‌ దిగుబడి సాధించారు. మల్బరి సాగు వల్ల ఉపయోగాలు గుర్తించి, విస్తరించడం ద్వారా అధిక లాభాలతోపాటు, సాగుకు అవసరమైన ఆకు లభ్యమైంది. నేడు రెండున్నర ఎకరాల మల్బరి క్షేత్రాన్ని బింధు సేద్యం ద్వారా సాగుచేస్తూ దాని కోసం బోర్‌వెల్‌ను వేశారు. 
డిపార్ట్‌మెంట్‌ నుండి రైతులకు కేవలం శిక్షణే కాకుండా మార్కెట్‌లో కూడా తగినంతగా ప్రోత్సాహిస్తున్నారని వెంకటరమణారెడ్డి అన్నారు. నేడు రూ. 25 వేలు పెట్టుబడి పెడితే రూ. 1,63,800 ఆదాయం వచ్చిందన్నారు. క్రాస్‌బ్రీడ్‌ 300 చాకీ (ప్రతి దఫాలో) సాగు చేయగా రూ. 18,200 (ఒక దఫాలో) ఆదాయం వచ్చిందన్నారు. ఒక సంవత్సరంలో 12 దఫాలుగా దిగుబడి సాధిస్తున్నారు. 
కుటుంబమంతా సెరికల్చర్‌లోనే… 
స్కూల్‌కి వెళ్లే పిల్లలు తప్ప, వెంకటరమణరెడ్డి కుటుంబమంతా సెరికల్చర్‌లో ఉన్నారు తమ రోజువారి విధులలో సెరికల్చర్‌ భాగమైపోయిందన్నారు. తన తల్లి కూలీలను పురమాయిస్తారని, భార్య కూడా సెరికల్చర్‌ నేర్చుకుని మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నేడు 13 మంది కూలీలతో ప్రతి దఫాలో పనిచేస్తున్నారు. వీరందరూ మల్బరి క్షేత్రంలో పనిచేస్తూ, షెడ్డులో పట్టుపురుగులను పెంచుతున్నారు. వీరందరికి భోజన వసతులు కల్పిస్తూ, వడ్డీ లేకుండా రుణాలిస్తు జాగ్రత్తగా సెరికల్చర్‌ చేస్తున్నారు. 
వెంకటరమణారెడ్డికి సెరికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌పై ఎంతో నమ్మకం ఉంది. సెరికల్చర్‌లో డిపార్ట్‌మెంట్‌ వారి సూచనలు ఖచ్చితంగా పాటిస్తారు. 
సెరికల్చర్‌ లాభదాయకం 
సెరికల్చర్‌ నుండి వచ్చే ఆదాయం ఒక సం||లో పెరగవచ్చు, తగ్గవచ్చు, కాని పూర్తిగా నష్టపోవడం మాత్రం వుండదంటారు వెంకటరమణారెడ్డి. సెరికల్చర్‌లో కొత్త పద్ధతుల వలన ఆదాయం మరింత పెరిగిందన్నారు. సాధారణంగా వ్యవసాయంలో పంట తరువాత పంటకి విరామం వుంటుంది. కానీ సెరికల్చర్‌లో ఒక సం||లో 12 దఫాలుగా దిగుబడి సాధించవచ్చన్నారు. కొకూన్‌ మార్కెట్‌లో కూడా రైతులకు సహాయపడే విధంగా డిపార్ట్‌మెంట్‌ వారి సహకారంతో కొకూన్‌కు మంచి ధర ఇస్తున్నారు. మార్కెట్‌ ప్రోత్సహకాలు కూడా సమయానికి అందుతున్నాయి అన్నారు. సెరికల్చర్‌లో మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా వెంకటరమణరెడ్డి కొన్ని సూచనలు చేశారు. కొకూన్‌కు మార్కెట్‌ ధరలను స్థిరపరచాలి. వ్యర్థాలను తొలగించే వేస్ట్‌ బెడ్డింగ్‌ మెటీిరియల్‌ మేనేజ్‌మెంట్‌ వెంటనే అమలుపసరచాలి. సెరికల్చర్‌ను ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ జాబితాలో చేరిస్తే కూలీలకు ఉపయోగంగా ఉంటున్నారు. 
సెరికల్చర్‌లో ప్రారంభించాక తమ జీవితాలలో మంచి మార్పు వచ్చిందన్నారు. రూ.2.5 లక్షల ఖర్చుతో రీరింగ్‌ షెడ్డు, రెండు మౌంటింగ్‌ హాల్స్‌ని రూ. 13 లక్షల వ్యయంతో నిర్మించారు. వీటికై చేసిన రూ. 3 లక్షలు అప్పుకూడా తీర్చేశారు. బోర్‌వెల్స్‌ కోసం రూ.1.5 లక్ష ఖర్చుచేసి తవ్వించారు. రూ.12 లక్షలతో సొంత భవనం ఏర్పర్చుకొని, టి.వి., ఫ్రిజ్‌, బైకు కూడా కొన్నారు. సెరికల్చర్‌ వల్ల ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జీవిస్తున్నామని వెంకట్రమణారెడ్డి అన్నారు. 

Share.

Comments are closed.