విశాఖ మన్యంలో ఒక వెరై’టీ’

Google+ Pinterest LinkedIn Tumblr +

విశాఖ మన్యంలో ఒక వెరై’టీ’ 
శ్రమను కాచి,లాభనష్టాలను వడిబోసి, మధురమైన తేనీటి ఫలితాలను తలా కొంత ఆస్వాధించడం చూశారా? ఇదొక రుచికరమైన విజయం. ఆవి కేవలం కాఫీ ఆకులే కాదు, కొన్ని వందల గిరిజనుల చెమట చుక్కలు. ఆ శ్రమైక్యజీవన సౌందర్యాన్ని చూడాలంటే తూర్పుకనుమల్లోని ఆరకు,చింతపల్లి వైపు వెళ్లాల్సిందే. అక్కడ కనుచూపు మేరా కాఫీ తోటలు కనువిందు చేస్తాయి. అరకు కాఫీకి ఒక చరిత్ర ఉంది. ఇపుడు కాఫీ ఆకుల పానీయం ఆ చరిత్రకు ఒక కొనసాగింపు.
పారేసే ఆకులే
జూన్‌,జూలై నెలల్లో కాఫీ మొక్కలు కొత్త చిగుర్లు తొడుగుతుంటాయి. గింజలకు ఎక్కువ పోషకాలు అందడం కోసం, రైతులు ఆకులు, కొమ్మలు విస్తరించకుండా, కత్తిరించి పారేస్తారు. ఆలా పారేసిన కాఫీ ఆకులను సేకరించి, గ్రీన్‌ టీగా తయారు చేస్తున్నాడు ఒక ప్రవాస భారతీయడు. దీంతో ఇప్పటి వరకు కాఫీ గింజలతోనే జీవనోపాధి పొందుతున్న రైతులు ఆకులతో మరికొంత ఆదాయం ఆర్జిస్తున్నారు.

Read full Story in BBC….https://www.bbc.com/telugu/india-44843359

Share.

Leave A Reply