పనుల్లేవ్‌.. పైసల్లేవ్‌…

Google+ Pinterest LinkedIn Tumblr +

పనుల్లేవ్‌.. పైసల్లేవ్‌..

సిద్దిపేట్ నుండి చిత్తూర్ వరకు ఎవరిని కదిపినా కరెన్సీ వెతలే! యాభై రోజులుగా ఇదే యాతన!! రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీ నుంచి అంతో ఇంతో జీతంతో కుటుంబాన్ని నడుపుతున్న వేతనజీవి దాకా అందరూ బాధితులే!
నవంబర్‌ 8 అర్ధరాత్రి పిడుగులా పడిన ‘కరెన్సీ రద్దు’ నిర్ణయం బడుగుజీవితోపాటు అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది.
9వ తేదీన మేము చిత్తూ ర్ జిల్లా ,చంగం బాక్కం గ్రామం లో ఉన్నాం . ” కూలీ చేసి సంపాదించు కున్న డబ్బు ఇది. ఇప్పుడు చెల్లవు అంటున్నారు . మాకు బాంక్ ఖాతా లేదు . అసలు గ్రామం లో బ్యాంక్ లేదు . ఏమీ చెయ్యాలి ?” అని అడుగు తున్నారు పార్వతి,సన్యసమ్మ.

నేటికి 50 రోజులు గడిచి ప్రధాని చెప్పిన గడువూ ముగిసింది. కష్టాలు మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి.

జనం కష్టాలపై రెండు రాష్ట్రాల్లో ‘ruralmedia’పరిశీలన జరిపింది. పేదల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఇందులో స్పష్టమైంది..
ఉపాధి కరువై..బతుకు బరువై దిగాలుగా కాలం వెళ్లదీస్తున్నారు.
నిరుపేద కూలీల దగ్గరి నుంచి చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, రైతులు.. ఇలా ఎవరిని కదిలించినా గత 50 రోజులుగా పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు. తినే తిండికి కూడా తిప్పలవుతోందంటూ కన్నీరు పెడుతున్నారు. పండుగెలా గడుస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

paarvati-sanyasamma-changambakkam-ruralmedia

paarvati-sanyasamma-changambakkam-ruralmedia

సాగుకు తిప్పలైతంది
” నోట్లు రద్దు చేసినంక ఎవుసానికి మస్తు కష్టమొచ్చింది. 5వారాల నుంచి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చెప్పుకుంటే ఏడుపొస్తుంది. వానాకాలంలో ఎకరం మక్క, మరో ఎకరంలో కూర గాయల్ వేసిన. మక్కలు దెబ్బతిన్నయ్. చిక్కుడు , టమాట అమ్మితే చెక్కు ఇచ్చిండ్రు. దాన్ని పట్టుకుని బ్యాంకు చుట్టూ తిరిగినా.. రోజుకు రూ.2 వేలే ఇస్తున్నరు. ఎరువులు, విత్తనాలు ఉద్దెర తెచ్చినా.. కూలీలకు డబ్బులు ఇవ్వడం ఇబ్బంది అవుతోంది. పనుల్లేవ్‌.. పైసల్లేవ్‌.” – రాజయ్య , హుస్నాబాద్ , రాములమ్మ

పాల డబ్బులు  ఇస్తలేరు
నాకు ఎకరం పొలం, 4 గేదెలున్నాయి. రోజూ 10 లీటర్ల పాలను సిద్దిపేట్ అమ్ముతుంటా. పెద్ద నోట్లను రద్దు చేసినంక నెలనెలా ఇవ్వాల్సిన పాల బిల్లులు ఎవరూ ఇస్తలేరు. పాల పైసలల్ల సగం కూడా రాలె. దాంతోటి పిల్లల ఫీజులు, ఇంట్లో అవసరాలకు కూడా చేతులో పైసలు లేకుంట పొయినయ్‌. ఇట్లనే ఉంటే శానా పరేషాన్‌ గావాల్సి వస్తది. – రాములమ్మ, భీమ దేవరపల్లి

………………………………………………………………………………………

ఇంటింటికి కావాల్సింది మంచి నీళ్ళు.
కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ కాదు

ramanjaneyulu-gv

ramanjaneyulu-gv

అప్పులు ఆకలి లేని గ్రామాలు కావాలి కానీ
కేవలం అందరికి బ్యాంకు అకౌంట్లు మాత్రమే కాదు.

 

– Ramanjaneyulu GV

……………………………………………………………………………………..

Share.

Leave A Reply