ఇండిపెండెంట్‌ లైఫ్‌, ఇంటర్నేషనల్‌ లైన్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇండిపెండెంట్‌ లైఫ్‌, ఇంటర్నేషనల్‌ లైన్‌
కార్టూనిస్టుగా బతకాలనుకున్న వాడు ముందు గుజ్జార్‌ని స్టడీ చేయాలి. ఐడియాలో దమ్ము,గీతలో సత్తా ఉంటే ప్రపంచం మీ గీతల వెంట పడుతుందని ఈ కర్నాటక కార్టూనిస్టు నిరూపించాడు. గుజ్జార్‌ ఇప్పటి వరకు ఏ పత్రికలో కొలువు చేయలేదు. టెన్‌ టు ఫైవ్‌ బతుకంటే ఏంటో తెలీదు. తన బతుకు చిత్రాన్ని తానే గీసుకున్నాడు. కార్పొరేట్‌ సెక్టార్‌కి కార్టూన్‌ విలువను రుచి చూపాడు. సర్కారీ స్కీమ్‌లకు కార్టూన్‌ కళను అద్దాడు. క్యారికేచర్లు,కామిక్స్‌ గీసుకుంటూ నిరంతరం బిజీగా ఉండే గుజ్జార్‌ని మొన్న వర్షం కురిసిన సాయంత్రం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో కలిశాను.

నా కోసం పాప్లేట్‌ ఫిష్‌, తన కోసం లెమన్‌చికెన్‌ ఆర్డర్‌ ఇచ్చి లేటెస్ట్‌గా మంగోలియా ప్రజల కోసం వేసిన కామిక్స్‌చూపించారు. ‘రూరల్‌ మీడియా’ కోసం రైతులు, ప్రకృతి మీద వేసిన కార్టూన్లు ఇస్తానన్నారు. ఇపుడున్న కార్టూనిస్టుల్లో సతీష్‌ఆచార్య అదరకొడుతున్నాడని స్మార్ట్‌ ఫోన్‌ లో ఆచార్య కార్టూన్లు డిస్‌ప్లే చేసి చూపించారు.పక్కవాడి ప్రతిభను ప్రేమించే గుజ్జార్‌ గురించి మిత్రుడు గురుదత్తన్‌(కన్నడప్రభ కార్టూనిస్టు) చెప్పారు కానీ ఇపుడు చూశాను.

ఎవరికి తలవంచక ప్రతిభను నమ్ముకుని సమాజంలోని సకల సమస్యలపై వేలాది కార్టూెన్లు గీస్తూ, స్వతంత్రంగా సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న గుజ్జార్‌ ఈ తరం కార్టూనిస్టులకు ఒక స్ఫూర్తి.

“Cartooning is a life-long dream. I can’t imagine myself going without drawing even for a single day”

–  Gujjar

Share.

Leave A Reply