బుద్దుడు ఏ భాషలో మాట్లాడాడు?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుద్దుడి ఒంటిమీద ఒక్క ఆభరణం వుండదు, శరీరాన్ని కాపాడుకునే ఒక్క నిరాలంకార వస్త్రం తప్ప. అది అతడి ఆలోచనలకీ వర్తిస్తుంది. బుద్దుడు క్రీ.పూ. నివసించిన సామాన్య జనంతో వాళ్ళు మాట్లాడుకునే అర్థ మాగధి అనే భాషలోనే మాట్లాడాడు. నిజానికి ఆ మాటలు తప్ప వేరే ఏ ఇతరమాటలు కూడా అతనివి కావు.

బుద్దుడు చనిపోగానే అతని బోధనల సంకలనంపేరుతో జరిగిన మొదటి సమావేశంతోనే విభేధాలు ప్రారంభమయ్యాయి. శాఖలు ఏర్పడ్డాయి. భాష, భావజాలం కాలానుగుణంగా మారిపోయి ఏకంగా బూతుగా తయారయ్యాయి. పాలీ భాష పోయి పండిత సంస్కృతం వచ్చింది. నిరాడంబరత పోయి బుద్దుడు స్వర్గంలో తారలతో సంగమిస్తుంటాడని, మనం కూడా ఎక్కువస్త్రీలతో శరీరాల్ని సుఖపెట్టుకుందామనే తారపంక్తి శాఖదాకా ఈ ప్రస్థానం సాగింది. బుద్దుడిని గాంధార,మధుర శైలిలో అందంగా రూపొందించారు. బుద్దుని తర్వాత 500సంవత్సరాలకి అతడినుండి పూర్తిగా బౌద్దం దూరమయ్యంది. వెయ్యేళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా రూపొందింది. ఇక ఇప్పటి 2000 ఏళ్లకి కుక్కమూతి పిందెలు పుట్టుకొచ్చి అవి ఫలాలుగా మూడు శ్రీల రవిశంకర్, జగ్గీ వాసుదేవ్, రాందేవ్ బాబా ఆలోచనలు, శరీరాలమీద అందజేయబడుతున్నాయని గుర్తించాలి.

తన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన చెగువేరాని చంపి, ఆ విప్లవయోధున్ని అతని భావజాలానికి పూర్తి విరుద్దంగా ఫ్యాషన్ వస్తువులకు ఐకాన్ గా రూపొందించిన అమెరికానీతి, బుద్దుని బుద్దుని విషంలోనూ ఈ దేశంలోని ప్రత్యర్థి మతాలు, అభిమాతలు బుద్దుడిపట్ల చూపాయి, అతడి భావజాలాన్ని చంపేసి దేవుడేలేడన్న అతడిని దశావతారంలో మైత్రేయుడిగా అతడిని దేవుడుచేసి కూర్చోబెట్టి. నాగార్జునుడు శూన్యవాదన ముందుకుతెస్తే దానిమీద శంకరాచార అద్వైతం తెస్తే, మధ్వాచార్యుడు ద్వైతం తెస్తే, వల్లభచార్యుడు విశిష్టద్వైతం తెచ్చి, బౌద్దారామాల్ని లంజదిబ్బలుగా ప్రచారంచేసి, సంస్కృతాన్ని బౌద్దానికి అద్ది, ప్రజలకి దూరంచేసి మొత్తానికి ఈ దేశం నుండి తరిమేశారు. కాబట్టి బుద్దుడు కావాలంటే ఏ పుస్తకాలూ, సిద్దాంతాలూ, మతపద్దతులూ, శాఖల ఆలోచనలూ వదిలేయండి.

మొదటిసారి పదాన్ని తెలుసుకున్నట్లు పసిపిల్లల్లా స్వచ్చంగా, నిక్కచ్హిగా చూడండి. ఆత్మ అంటే ఏమిటి? అదెక్కడుంటుంది? వాదనకు దొరకదా? మనస్సుకీ లేదా మెదడూ గాక అదెక్కడుంటుందో అడగండి. నా చిన్నకొడుకు ఇలాగే అడిగాడు. అది అనుభవించాలి, చెబితే అర్థంకాదు అనే యోగి ఆత్మకథల్ని పరిగణించకండి. ధ్యానం అనేది పిరమిడ్ కట్టుకుని లోపలకూర్చొని శ్వాసమీద ధ్యాస అంటూ బుద్దుని విపసన ఇదే అనే వెధవల కబుర్లని నమ్మకండి. రామకృష్ణమఠంలో, వ్యాసాశ్రమలో, శుకబోధాశ్రంలో వేదాంతాలు బోధించి వానప్రస్తాశ్రమంలో బోధిచైతన్యలు (పేరుమార్చుకుని)గా మారి “ఓం మణేం పద్మే హూం” అనే దివ్యమంత్రం జపిస్తే చాలు “మోక్షం” సిద్దిస్తుందని పుంఖానుగా రాసే ఇట్లాంటి పుస్తకాలని పొయ్యిలో వేయండి.

బుద్దుడిని మాత్రమే, అదికూడా డైరెక్టుగా వినండి. అతడు, దారిలో నడిచేటప్పుడు ఎదురైన ఒక రైతుతో మాట్లాడింది, అజాతశత్రు అనే చక్రవర్తితో మాట్లాడింది, ఒక శ్రమనుడితో మాట్లాడింది, ఒక ఆస్థాన వేశ్యతో మాట్లాడింది, ఉపనిషత్తుల్ని పఠించినవ్యక్తితో మాట్లాడింది, ఒక బ్రాహ్మణుడితో మాట్లాడింది, పూజలు చేసేవాడితో మాట్లాడింది, తన కొడుకు రాహులునితో మాట్లాడింది, తన శిష్యుడు ఆనందుడితో మాట్లాడింది.. మాత్రమే వినండి. విన్న తర్వాత అతడే చెప్పినట్లు, మీ బుద్దికి అది సరైందికాదని తోస్తే, నిర్భయంగా తిరస్కరించండి.

ఒక్క పోస్టులో రాయాల్సింది, రాయకుండా ఇంత ఉపోద్గాతాలెందుకని విసుక్కోవద్దండి. రెండువేల సంవత్సరాలుగా మన మెదడులో ఒక భావజాలం పట్ల పేరుకున్న అభిప్రాయాల్ని రెండు పోస్టుల్లో రాసి “తాంబూలాలిచ్చేశాను…” అనలేక ఇదంతా రాయడం. ఒకటినిజం, కర్మ, ఆత్మ, పునర్జన్మ అనే ఒక్క పేరాలోని విషయం చదివాక దాదాపు ప్రతివ్యక్తి జీవితంలో అయితే యవ్వనం నుండి, కాకపోతే వృద్దాప్యంలో ఎదురయ్యే తప్పని ప్రశ్నలకు సింపుల్ సమాధానాలు దొరుకుతాయి. స్టే ట్యూన్. -Siddharthi Subhas Chandrabose

Share.

Leave A Reply