వ్యవసాయం లో నల్ల విప్లవం

Google+ Pinterest LinkedIn Tumblr +

సగటున రెండున్నర ఎకరాల పొలం లో స్త్రీలు 557 గంటలు నాట్లు వేస్తారు. 640 గంటలు కలుపు తీస్తారు. 384 గంటలు నీటి పని చూస్తారు. 984 గంటలు కుప్పలేసి నూర్చుతారని ఒక సర్వే. వ్యవసాయ పనుల్లో, ఆహారోత్పత్తిలోని అన్ని దశల్లో, నిత్యం చెమట చిందించే వారంతా మహిళా రైతులే. అయినా వీళ్లను రైతులుగా గుర్తించరు.
ఒక రైతు కుటుంబం దగ్గరకు వెళ్లి, ఈ ఇంట్లో రైతు ఎవరని అడిగితే, ఆ ఇంటామె ఎంత శ్రమ చేసినప్పటికీ మగవాళ్లనే రైతుగా చూపించడం కామన్.
కాని , సిద్దిపేట జిల్లా,తొగుట మండలం, లింగాపూర్ గ్రామంలో జక్కుల తిరుపతి ఇంటికి వెళ్లి అడిగితే, తన భార్యే రైతు, నేను ఆమె దగ్గర కూలీని అని గర్వంగా చెబుతాడు.
ఆమెలో ప్రత్యేకత ఏమిటో తెలుసా..? వ్యవసాయం లో నల్ల విప్లవం సృష్టిస్తోంది. ఏ సాగుబడి చూసినా, పొలమంతా ఆకుపచ్చగానే కనిపిస్తుంది. కానీ, రేణుకమ్మ చేనుకు వెళ్తే మాత్రం, ఇంద్రధనస్సులా అనేక రంగుల్లో దర్శనమిస్తుంది. నలుపు, ఎరుపు, పసుపు, బంగారు వర్ణంలోని వరి చేలు అబ్బురపరుస్తాయి. దేశ, విదేశాల నుంచి సేకరించిన అనేకానేక  రైస్‌ వెరైటీలు సుగుంధాలను వెదజల్లుతుంటాయి. ఏపుగా, వెడల్పుగా పెరిగే భిన్నమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వరి రకాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ వానకాలం సీజన్‌లో మూడు ఎకరాల్లో ‘నల్ల, ఎర్ర వరి’ని పండిస్తున్నది ఈ చిన్నకారు రైతు. ఈరకం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే, నరాల బలహీనత, షుగర్‌ మటుమాయమవుతుందని ఆమె అంటున్నారు. నల్ల బియ్యం, వరితోపాటు వడ్లు కూడా నల్లగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌లాంటి రుగ్మతలకు మందుగా పనిచేస్తుంది. ఇవే కాకుండా, సువాసన వెదజల్లే,  బాస్మతి సెంటెడ్‌ రైస్‌ , ఛత్తీస్‌గఢ్‌ రకాలను విత్తన వృద్ధి కోసం సాగు చేస్తున్నారు. ఆమె పండిస్తున్న , చిట్టి ముత్యాల వరి నుంచి వచ్చే ధాన్యం,  అచ్చంగా ముత్యాలను పోలి ఉంటాయి.

ఔషధ గుణాల వరి విత్తనాలు కావాలా ?  పురాతన వరి వంగడాలకు తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ధి. కానీ, ఆధునిక సాగుతో ఎన్నో రకాలు మరుగున పడిపోయాయి. క్రిమిసంహారక మందులు వాడితే దిగుబడి ఎక్కువగా రావొచ్చు. కానీ, వాటి వల్ల మనుషుల ఆరోగ్యం చెడిపోతున్నది. అలాంటి వరి గడ్డి మేసిన పశువుల ద్వారా వచ్చే పాలు కూడా కల్తీ అవుతున్నాయి. ఈ పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. అందుకే అందరూ ప్రకృతి  వ్యవసాయం వైపు మళ్లాలి. సెంద్రీయ పద్దతులు అనుసరించడం వల్ల రేణుక పొలంలో నేల స్వభావం శక్తిమంతంగా మారింది. పురాతన వరి వంగడాలను సాగు చేయాలి. అందుకోసమే ఇప్పటిదాకా 50 రకాల వంగడాలను భద్రపరిచారు.  అడిగిన వారికి విత్తనాలు అందిస్తున్నారు. ( నల్ల, ఎర్ర, చిట్టి ముత్యాల వరి విత్తనాలు, బియ్యం కావాల్సిన వారు , 9000269724 నంబర్ కి కాల్ చేయండి.)

Share.

Leave A Reply