‘ నాటు బాంబులు సరసమైన ధరకు దొరుకును’

Google+ Pinterest LinkedIn Tumblr +

కడప నుండి పులివెందుల వైపు వెళ్తున్నాం…’ఇక్కడ తుపాకులు, నాటు బాంబులు సరసమైన ధరకు దొరుకును’ అనే బోర్డు స్వాగతం పలికింది. ఇంతలో తెల్లచొక్కాలు వేసుకున్నొళ్ళు హడావడిగా ఎవరినో తుపాకులతో తరుముతున్నారు, ఈ సీన్‌ను తట్టుకోలేక, భయంతో ఒక స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌లోకి పరుగులు పెట్టాం.. అక్కడ దృశ్యం మరింత బీభత్సం…
భూకబ్జాలు చేయడంలో చిట్కాలు ? వేటకొడవలికి పదును పెట్టడం ఎలా..?బాంబులు చుట్టడం, విసరడంలో నైపుణ్య పాఠాలను నిరుద్యోగులకు నేర్పిస్తున్నారు. అది తట్టుకోలేక మళ్లీ రోడ్డు మీదకు వచ్చాం…మా పక్కనుండే తెల్లని సుమోలు దుమ్ము రేపుతూ దూసుకుపోతున్నాయి. వాటి డోర్లకు తెల్ల లుంగీల మనుషులు వేలాడూతూ, నల్లని కత్తులు తిప్పుతూ, ‘ వేసేయండ్రా ‘ అని అరుస్తున్నారు. వారి నుండి భయట పడాలని, ప్రశాంతంగా ఉన్న పొలాల వైపు పరుగులు తీశాం…అక్కడ చీనీ బత్తాయి తోటలను కసకసా నరికేస్తున్నారు, రెయిన్‌ గన్‌ల బదులు నాటు గన్‌లు కనిపించాయి. ఇదంతా చూడలేక సొమ్మసిల్లి పడిపోతుంటే…
……………….
………………….
”ఇక లేవండీ…చినలేబాక వచ్చాం…” అని డ్రైవర్‌ తట్టడంతో పీడకల నుండి ఉలిక్కిపడి లేచా…
ఎదురుగా ప్రకృతి సాగు చేస్తున్న వాణేశ్వరి,అమరనాధ్‌ల నవ్వుతూ… కనిపించడం తో మనసు కాస్త కుదుట పడింది.

Share.

Leave A Reply