‘గుడ్ టచ్, బాడ్ టచ్’ పై అవగాహన

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇరుగుళం ఉన్నత పాఠశాలలో బాలికలకు అవగాహనా సదస్సు

శ్రీసిటీ, జులై 7, 2018:- మన సమాజంలో తల్లిదండ్రులనందర్నీ ఇప్పుడు కలవరపెడుతున్న, భయపెడుతున్న విషయం పసిపిల్లలపైపెరుగుతున్న అత్యాచారాలు. దాదాపుగా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట పిల్లలపై అత్యాచారాల గురించిన వార్తలే వింటున్నాం. ఇలాంటి ప్రమాదాలనుంచి తమను తాము కాపాడుకోవడం ఎలా అనే విషయంపై ఆడపిల్లలకు,   ముఖ్యంగా యుక్త  వయస్సులోకి అడుగుపెడుతున్న వారికి సమగ్రఅవగాహన కలిగించే ఉద్దేశ్శంతో, శ్రీసిటీ  ఫౌండేషన్ మరియూ శ్రీసిటీ పోలీస్ అధికారులు సంయుక్తంగా, ఇరుగుళంలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఒక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

Awareness programme on ‘good touch and bad touch’

Awareness programme on ‘good touch and bad touch’

శ్రీసీటీ డి.ఎస్పి విమలకుమారి బాలికలకు వాత్సల్యపూర్వక స్పర్శకు, దురుద్దేశ స్పర్శకు (గుడ్ టచ్, బాడ్ టచ్) మధ్య తేడా తెలియ చెప్పి,తమకు ఇబ్బందిగా వుండే ఏ విధమైన స్పర్శ అయినా అది ‘బాడ్ టచ్అని  వాళ్ళకు తెలియ చెప్పారు. వాళ్ళ కన్నా పెద్ద వాళ్ళు ఏదైనాఅశ్శీల ఫొటో పిల్లలకు చూపించినట్లైతే, అది కూడా అభ్యంతరకరమె అవుతుందని చెప్పారు. ఒక్క పిల్లలు మాత్రమే తమను ఎవరు తాక వచ్చోనిర్ణయం తీసుకోగలరని,  తమకు ఇష్టం లేదని చెప్పే హక్కు వున్నదని వాళ్లకు తెలియజెప్పారు. సంబంధిత విషయాలు తెలుసుకోవడానికిఅవసరమైన వీడియోలను చూపించి, ఇబ్బందికర పరిస్తితులనుండి ఎలా తప్పుకోవాలో విశదీకరించారు. శరీరంలో కలిగే మార్పులు, పునరుత్పత్తిఅవయవాలు, వాటికి సంబంధించిన మంచి చెడూ అవగాహన (సెక్సు ఎడ్యుకేషన్) పిల్లలకు తల్లులే  నేర్పాలని చెప్పారు.

ఆడపిల్లలు అపదలెదురైనప్పుడు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా, సమయస్పూర్తితో, తప్పించుకొని, తమ పెద్దలకు, పోలీసు వారికి ఫిర్యాదుచేయాలని, అప్పుడే అత్యాచారాలు చేసే వారికి సరైన శిక్ష పడుతుందని చెప్పారు. పోలీస్ వారి రక్షణ ఎప్పుడూ ఉంటుందన్న భరోసా ఇచ్చారు.విద్యార్ధినుల సందేహాలకు తగు సమాధానాలను విమలకుమారి ఇచ్చారు.

ఇటువంటి కార్యక్రమం గత బుధవారం నాడు స్థానిక చిన్మయా  విద్యాలయంలో కూడా జరిగింది.

మొత్తం 500 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ అవగాహనా సదస్సులలో పాల్గొన్నారు. పాఠశాలల ఉపాద్యాయులు ఇటువంటి కార్యక్రమాల వల్లవిద్యార్ధినులలో  ఆత్మ స్థైర్యం పెరుగుతుందని అన్నారు. శ్రీసిటీ  ఫౌండేషన్  మేనేజర్ సురేంద్ర, శ్రీసిటీ పోలీస్ సబిన్స్పెక్టర్ సుబ్బారెడ్డి కూడా ఈకార్యక్రమాలలో పాల్గొన్నారు.  ( C. RAVINDRANATH)

Share.

Leave A Reply