రూరల్‌ మీడియా కథనాలకు అవార్డులు

Google+ Pinterest LinkedIn Tumblr +

పెద్దగా చదువూ సంధ్యాలేని ఆడవాళ్లు, 
మారుమూల గ్రామాల్లో పనులు చేసుకు బతికే పేదవాళ్లు, 
రెక్కాడితేకానీ డొక్కాడని అతిసాధారణ గ్రామీణులు, 
నిరంతరం బతుకు పోరాటంలో నలిగిపోతున్న స్త్రీలు…. 
ఇలాంటి అట్టడుగున వున్న, ఎవరికీ పట్టని, ఎందుకూ కొరగానీ ముగ్గురు ఆదీవాసీ మహిళలు అద్భుతాలు సృష్టించగలరంటే మీరు నమ్మగలరా? వాళ్లు సాధించింది మామూలు విజయం కాదు. అందుకే వారి విజయాలను రూరల్‌ మీడియా డాక్యుమెంట్‌ చేసింది. ఆ కథనాలకు స్పందించిన ప్యూర్‌ ఆర్గనైజేషన్‌ 8.3.2019న మహిళా దినోత్సవం సందర్భంగా వారిని హైదరాబాద్‌ ఆహ్వానించి అవార్డులతో సత్కరిస్తున్నారు. 

laxmidevamma


ఊరికి నీరొచ్చింది… 
మగవాళ్లు విఫలమైన చోట ఆడవాళ్లు బాధ్యత తీసుకోక తప్పదు.మహదేవ్‌ పూర్‌ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) గ్రామంలో అదే జరిగింది.దశాబ్దాలుగా అక్కడి మహిళలు నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచీ నడిచీ అలసి పోయారు.చివరికి 30 మంది మహిళలు బృందాలుగా ఏర్పడి గ్రామ చుట్టుపక్కల నీటి చెమ్మను వెతుకుతూ దాదాపు ఇరవై పంట కుంటలను తవ్వారు. ఆ ప్రయత్నం ఫలించి ఏడాది తిరిగే లోగా తమ నీటి కష్టాలను దూరం చేసుకున్నారు, వారికి నాయకురాలు మడివి లక్ష్మీ దేవమ్మ .

satyavati


చీకటి గూడెంకు వెలుగులు… వృధాగా పోయే ఏలేరు నది నీళ్లలో బట్టలు ఉతకడం, చేపలు పట్టడం మాత్రమే తెలిసిన ఆ గిరిజన మహిళలకు ఆ నీటి నుండి పవర్‌ కూడా తీయెచ్చు అని ఒక శిక్షణలో తెలుసుకున్నారు. సత్యవతి నాయకత్వంలో వారంతా ఒక సంఘంగా ఏర్పడి, రంపచోడవరం ఏజన్సీలో జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్వహిస్తు వారి చీకటి గూడెంకు వెలుగులు పంచుతున్నారు. 

తొలి సేంద్రియ గ్రామం … మంజువాణి విజయనగరం జిల్లా కొండల మధ్య ఉన్న కొండబారిడి గ్రామ సర్పంచ్‌. తన సవర తెగ మహిళలందరినీ కూడగట్టి, సేంద్రియ పంటల సై అవగాహన కల్పించి, తమ ఊరిని ఆర్గానిక్‌ గ్రామంగా మార్చారు. అక్కడందరూ సేంద్రియపంటలు మాత్రమే పండించి, రాస్ట్రంలో తొలి సేంద్రియ గ్రామంగా గుర్తింపు పొందారు. 

( PURE, a non-profit US organization and a registered Indian trust facilitates sustainable Empowerment through quality Education.)

Share.

Leave A Reply