పేదలఆకలి తీర్చాలనుకుంటున్నారా..

Google+ Pinterest LinkedIn Tumblr +

దాతలు నేరుగా ఆహార పదార్థాలు, బియ్యం పంపిణీ చేయరాదని, జీహెచ్‌ఎంసీ సెంట్రలైజ్డ్‌ సెల్‌కు సమాచారం అందిస్తే అధికారులే ఆ సామాగ్రిని పంపిణీ చేస్తారని, hyderabad నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విజ్ఞప్తిచేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు,కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహార ప్యాకెట్లు, బియ్యం పంపిణీ చేస్తున్నారని, వారి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పంపిణీ సందర్భంగా ప్రజలు గుమిగూడడంవల్ల లాక్‌డౌన్‌ ఉద్దేశం నీరుగారే అవకాశం ఉందని, ఈ పరిస్థితిని నివారించేందుకు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ ప్రియాంక ఆధ్వర్యంలో ప్రత్యేక సెంట్రలైజ్డ్‌ వింగ్‌ను ఏర్పాటుచేసినట్లు మేయర్‌ చెప్పారు. పది మొబైల్‌ వాహనాల ద్వారా దాతలనుంచి ఆహార పదార్థాలు, బియ్యాన్ని సేకరించి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే వాటిని పంపిణీచేస్తామని చెప్పారు. ఎవరికి వారే పంపిణీ చేయడంవల్ల ప్రజలు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా గుమిగూడుతున్నారని పేర్కొన్నారు. దాతలు 9493120244, 7093906449 ఫోన్‌చేయాలని, లేనిపక్షంలో twitter@ PDUCD_ GHMC ట్విట్టర్‌ ఖాతాకు సమాచారం అందించవచ్చని తెలిపారు. బియ్యం, ఆహార సామాగ్రే కాకుండా జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన తాత్కాలిక షెల్టర్‌ హోమ్‌లలో ఉన్న వలస కార్మికులు, నిరాశ్రయులు, అనాథలకు మాస్క్‌లు, ఇతర వస్తువులు పంపిణీచేయాలన్నా ఈ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. 

Share.

Leave A Reply