తొలి ప్రకృతి వ్యవసాయ గ్రామం,ఎలా ఉంటుందో చూడండి

Google+ Pinterest LinkedIn Tumblr +

” అరవై ఏండ్ల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడిపంతులు భూమికోసం, భుక్తి కోసం ఉద్యమిస్తూ, ప్రజలకు విప్లవపాఠాలు బోధించాడయ్యా… అల్లదిగో అదే అయన ఇల్లు. ” అని,తూరుపు కనుమల్లో మొగ్గతొడిగిన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, పడిపోయిన మట్టి గోడల ఇల్లు, మాకు చూపించాడు ఆ గ్రామపెద్ద. నేడు అదే చోట మరో కొత్త ఉద్యమం పుట్టింది. రసాయన ఎరువుల నుండి ఆ నేలను కాపాడడానికి మరో టీచర్ సేంద్రియ విప్లవం సృష్టించాడు.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఆదివాసీ పల్లె కొండబరిడి. అక్కడి పొలాల్లో అడుగుపెడితే, భూమిలోంచి పైకి లేచిన వాన పాములు పాదాలకు గిలిగింతలు పెడుతుంటాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు మన చుట్టూ తిరుగుతుంటాయి. గోరింకలు,పాలపిట్టలు,పిచ్చుకల రెక్కలు రెపరెప కొట్టుకుంటూ గాలిలోకి లేస్తుంటాయి.

రసాయనాలు లేని ఈ మట్టిపరిమళం ఆ జీవాలకు నీడైంది. ఇక్కడి ప్రజలు ఐక్యతా, ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్ఛంగా మార్చి, ఆంధ్ర ప్రదేశ్లో తొలి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా ఎలా మారిందో చూడండి… https://youtu.be/Nns2rviKHis

Share.

Leave A Reply