ఆంగ్లం లో బోధన – నా అనుభవాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ముఖపుస్తకంలో గాని , టీవీ చర్చల్లో గాని ప్రధానంగా మూడు అంశాలు లేవనెత్తుతున్నారు .  1 . అగ్రవర్ణ కులీన వర్గాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే మాతృభాషా పరిరక్షణ బరువు  బడుగు బలహీన వర్గాలు మాత్రమే ఎత్తుకోవాలా ? ఈ వాదనలో   న్యాయం ఉంది  .  2 . తెలుగు భాష గురుంచి గగ్గోలు పెట్టేవాళ్లంతా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లోనే చదివిస్తున్నారు . ఇది ముమ్మాటికీ వాస్తవం . ఇక మనము ఈ hypocrtic  ఎమోషనల్  baggage లోంచి బయట పడితే అతిముఖ్యమైన మూడో అంశం గురుంచి  ప్రాక్టికల్ గా విశ్లేషిద్దాము .  3 . ఇంగ్లీష్ మీడియం లో చదవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెంది జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో ఉద్యోగ అవకాశాల్ని బలహీన వర్గాలు ఒడిసి పడతాయి . ఇది నిజంగా సాధ్యమా ? ఇందులో సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాము . 
ఉద్యోగానికి ప్రధాన అర్హత ఏమిటి ? domain knowledge or mere communication skills ? ఒక ఇంజనీర్ , టీచర్ ,మేనేజర్ ,  లాయర్, సినిమా డైరెక్టర్ ఇలా  తమ తమ సబ్జెక్టులో ప్రావీణ్యత లేకుండా కేవలం ధారాళమైన ఇంగ్లీష్ మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయా ? గత రెండు మూడు తరాలుగా తెలుగు మీడియం లో చదివి , ఇంగ్లీష్ నేర్చుకొని జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న వారి మాటేమిటి ? అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం లో చదివి జీవితంలో అంతే  స్థాయిలో స్థిరపడ్డ శాతం ఎంత ? 
ప్రభుత్వ పాఠశాలలను వదిలేయండి . దాదాపు 40 ఏళ్ల కిందనే ప్రైవేట్ పాఠశాలల్లో , కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టారు . కొన్ని elite స్కూల్స్ ని వదిలేస్తే మిగతా వాటిల్లో ఇంగ్లీష్  టీచర్ల  బోధనా సామర్ధ్యం ఎంత ? వాటిల్లోంచి బయటికి వచ్చిన విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ సత్తా ఎంత ? ఎందుకు ఇంజనీరింగ్ , mba విద్యార్థుల employability స్కిల్స్ , ఇండస్ర్టీ రెడీనెస్ ( ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివిన వారు 75 %) 15 శాతం కన్నా తక్కువ ఉంది ? 

B.P.Padala

మరి ఉన్నపళంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్  మీడియం పెడితే వచ్చే పర్యావసానాల్ని అధ్యయనము చేశారా ? ఒక టీచర్ ఇంగ్లీష్ సబ్జెక్టు కాకుండా మిగతా సబ్జెక్టులలో కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని భోదిస్తే , విద్యార్థులు అర్థం చేసుకొని పరీక్షల్లో ఇంగ్లీష్ లో రాయడం . ఇంత ప్రాసెస్లో క్లిష్టతని ఎవరైనా అర్థం చేసుకున్నారా ? ఎక్కడ ఈ వలయం తెగిపోయినా నష్టం ఎవరికి? కనీసం నగరాల్లో ఉండే రెమెడీయల్ ట్యూషన్ సౌకర్యం కూడా ఉండదు ఊర్లలో . ఒక భాషలో పట్టు రావాలంటే చదవడం , రాయడం , మాట్లాడం అనే eco system ఉండాలి . వచ్చి రానీ ఇంగ్లీషులో స్కూల్లో చదివి , ఇంట్లో , బయట తెలుగు లోనే మాట్లాడే పరిస్థితులు ఉన్నప్పుడు ? మాతృభాషా అధికారంతోనే మిగతా భాషల మీద పట్టు వస్తుందని భాషా శాస్త్రవేత్తల ఘోషల మధ్యన , ఎలాంటి supportive    ecosystem అభివృద్ధి చేయకుండా త్రిశంకు స్వర్గం లోకి కొన్ని తరాలను నెడితే వాళ్ళ భవిష్యత్తు ? 
ఇంగ్లీష్ మీడియం లో చదువుతూ అటూ భాషా రాకా ఇటూ సబ్జెక్టు రాకా ఉభయ భ్రష్టత్వం కన్నా , కనీసం హైస్కూల్ వరకునా   మాతృభాషలో ఆప్షనల్స్ ని ఔపోసన పడుతూ , ఆంగ్లభాషా ప్రావీణ్యం కొరకు ఇంగ్లీష్ ల్యాబ్ లాంటి స్పెషల్ డ్రైవ్ చేపట్టి , ఇంటర్ , డిగ్రీ compulsary ఇంగ్లీష్ మీడియం చేస్తే  అటు domain knowledge , ఇటూ communication skills తో employability ready  గా ఉండొచ్చు . 
అనాలోచితమైన ప్రతీ మార్పు మంచిదేమీ కాదు . change for the sake of change might destroy the status quo but not necessarily yield the desired results and mutations could be more unpalatable. ఒక పాత విలువని ధ్వంసం చేస్తే కొత్త విలువ అంతకంటే ఉన్నతంగా లేదా ఉపయోగకరంగా అయినా ఉండాలి . 
ఈ ఎడ తెగని చర్చ రాజకీయ , సిద్ధాంత రంగు పులుముకొని టీచర్ల గొంతు బేలగా అయిన    సందర్భంలో ,  పిల్లల  భవిష్యత్తు మీద ప్రేమతో , బెంగతో ఈ నాలుగు వాక్యాలు .

  • B.P.Padala (Works at ROOTS Collegium)
Share.

Leave A Reply