ఏపీలో క‌రెంట్ ఛార్జీలు తగ్గాయా?పెరిగాయా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రఘు, రామ్మోహన్‌ కొత్త టారిఫ్‌ ప్రతులను విడుదల చేయ‌గానే…. విద్యుత్ ఛార్జీలు వాయింపు, బాదుడు, వంటి వార్త‌ల‌తో కొన్ని పత్రికలు వార్త‌లు వండి వార్చాయి … కానీ . Regulatory Commission నిర్ణ‌యం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది వినియోగ దారుల‌కు ఛార్జీలు తగ్గు తాయి అంటున్నారు విశ్లేషకులు. అదెలా అంటే…
గత ప్రభుత్వం అనేక మార్గాల్లో విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై మోపింది. ఇందులో శ్లాబుల వర్గీకరణ ఒకటి. గత ఏడాది వినియోగాన్ని కొలమానంగా తీసుకుని ప్రస్తుత సంవత్సరంలో విద్యుత్‌ భారం మోపేవారు. ఉదా.. గత ఏడాది విద్యుత్‌ వినియోగం 600 దాటి 601కి చేరితే.. ప్రస్తుత విద్యుత్‌ టారిఫ్‌లో 0–50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 బదులు రూ.2.60 వసూలు చేసేవారు. ఇలాంటి పరోక్ష పద్ధతులకు ఇప్ప‌టి కమిషన్‌ స్వస్తి పలికింది. కొత్త అర్డ‌ర్ ప్రకారం మీ పాత ఏడాది వాడ‌కాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు. ఇపుడు ఎంత వాడారో ఆ కేట‌గిరిలోనే ఛార్జీలు తీసుకుంటారు. అంటే మొద‌టి 50 యూనిట్ల‌కు 1.45 చొపున మిగిలిన 23 యూనిట్ల‌కు 2.60 చొపున వ‌సూలు చేస్తారు . ఇలాంటి ఇలాంటి వినియోగ దారులు లక్షల్లో ఉంటారు.
లాభాపేక్ష లేని ప్రభుత్వ విద్యాలయాలు, ఆసుపత్రులను వాణిజ్య కేటగిరీ నుంచి హెచ్‌టీలోని సాధారణ కేటగిరీలో చేర్చారు. దీనివల్ల పీక్‌.. నాన్‌ పీక్‌ అవర్స్‌లో వేర్వేరు ధరల నుంచి తప్పించారు.
దోభీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌ కొనసాగుతుంది.
సంపన్న వర్గాలకు (500 యూనిట్లు దాటితే) యూనిట్‌కు కేవలం 90 పైసలు పెంచింది. (రూ.9.05 నుంచి 9.95 చేసింది). ఇలాంటి వారు రాష్ట్రంలో 1,43,65,000 మంది ఉన్నారు. ఈ పెంపువల్ల వచ్చే ఆదాయం గరిష్టంగా రూ.50 కోట్లు మాత్రమే.
ఈ సందర్భంగా, నియంత్రణ మండలి చైర్మన్‌ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. 99 శాతం విద్యుత్‌ వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా, విద్యుత్‌ పంపిణీ సంస్థలకు నష్టం వాటిల్లకుండా టారిఫ్‌ను రూపొందించామని, డిస్కమ్‌ల ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు.

పేదోడి కరెంట్‌ బిల్లు పెరగదు
అల్పాదాయ వర్గాల కరెంట్‌ బిల్లులు ఈ ఏడాది పైసా కూడా పెరిగే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఏపీలో 1.45 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల విద్యుత్‌ వాడకం ఉన్నవారు 50.90 లక్షల మంది. వీరికి గతంలోనూ, ఇప్పుడూ వచ్చే కరెంట్‌ బిల్లు (యూనిట్‌ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50. ఇక నెలకు 51–75 యూనిట్ల విద్యుత్‌ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు. వీరికి గతంలో రూ. 137.50 బిల్లు వచ్చేది.. ఇప్పుడూ అంతే. (50 యూనిట్ల వరకూ యూనిట్‌ రూ.1.45.. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్‌ రూ.2.60 చొప్పున). అంటే.. దాదాపు 74 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్‌ బిల్లు పెరిగే ప్రసక్తే లేదు.
మారిన శ్లాబ్‌ ప్రకారం ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే కాబట్టి కరెంట్‌ బిల్లులు తగ్గుతాయి. అని, నాగార్జునరెడ్డి అంటారు.

క్వాలిటీ పవర్ కావాలి … సామాజిక విశ్లేషకులు కండ్లగుంట శ్రీ‌నివాస్‌గారు ఇదే విషయం పై స్పందిస్తూ ,
”ఇవాళ మనకు ఉత్పత్తవుతున్న కరెంట్ లో అధికశాతం సోలార్ పవర్ హైడ్రో పవర్ నుండి వస్తుంది ధర్మల్ పవర్ స్లో గా తగ్గించగలుగు తున్నాం సోలార్ పి పి ఏ ఏ లను రద్దు చేయడం వలన కొత్తవాటిని ప్రోత్సహించ లేక పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు సగటున 5 గంటల అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది క్వాలిటీ పవర్ ఇచ్చినప్పుడు విద్యుత్ చార్జీలు పెంచడాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ సప్లై లేనప్పుడు చార్జీలు కూడా పెంచితే దానిని ప్రభుత్వ అసమర్థత గా పరిగణిస్తారు .”అన్నారు

భారం తగ్గు తుందా… ? ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ ఎంపీ, విజ‌య‌సాయి రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ …” ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్‌ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టింది. కొత్త టారిఫ్‌తో కోటీ 43 లక్షల మంది వినియోగదారులకు 60 కోట్ల వరకు భారం తగ్గుతుందన్న వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెర తీసింది. ”  అన్నారు .

సామాన్యుల ప్రశ్న విజ‌య‌శాయి రెడ్డి ప్రకటన పై తూరుపు గోదావ‌రి జిల్లా నుండి కొంద‌రు స్పందిస్తూ…. 500 యూనిట్ల లోపు వాడిన సామాన్యులకు ఈ టారిప్ తో న‌ష్టం లేన‌ప్ప‌టికీ , జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాల్లో కరెంట్ కోతలు ఇప్పటికీ తగ్గ లేదు . క‌రెంట్ తక్కువగా వాడే ఈ కాలంలోనే ఇలా ఉంటే రాబోయే వేసవిలో ఎన్ని స‌మస్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందో…? దీనికి మీరు భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌రా…ఎంపీ గారు ? అని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Share.

Leave A Reply