పిల్లలందరూ ఇంగ్లీషు నేర్చుకోవాలా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆం.ప్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచిన కంపల్సరీ ఇంగ్లీషు మీడియం
పై Politician C. Ramachandraiah స్పందన. 1. పిల్లందరూ ఇంగ్లీషు నేర్చుకోవాలి. ధైర్యంగా ఇంగ్లీషులో మాట్లాడగలగాలి. దీనికి ఇంగ్లీషు మీడియం ముఖ్యం కాదు, ఇంగ్లీషు సబ్జక్టు, గ్రామర్, వాక్యాలు నిర్మించి అవగాహన చేసుకోవడం ముఖ్యం. 2. ఇపుడు ప్రయివేటు స్కూళ్ళైన నారాయణ, చైతన్యలలో చదివే మెజారిటీ పిల్లలకు మీడియం ఆంగ్లమైనప్పటికీ భాష రాకపోవడానికి కారణం ఇంగ్లీషు సబ్జక్టును నేర్పక పోవడమే. ఈ లోపం వల్లనే చిన్నప్పటినుండి ఇంగ్లీషు మీడియం లో చదివి ఇంజనీరింగ్ పూర్తిచేసినప్పటికి కనీస ప్రమాణాలు లేక 70% మంది కి పైగా ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. 3. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వ స్కూళ్ళలో ప్రమాణాలు పెంచాలి – ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, బడి వాతావరణం వగైరా. ఆ తర్వాత టీచర్ల నైపుణ్యం పెంచడం. (ఢిల్లీలో ఈ అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టింది అక్కడి ప్రభుత్వం.)  

4. కాని వాటిమీద దృష్టి పెట్టకుండా ఆంగ మాధ్యమం ఒకటవ తరగతి నుండి ప్రవేశపెట్టడం తొందరపాటు చర్య అంటాను. రెండు సం.ల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత ఆం.మా ప్రవేశపెట్టవచ్చు. అధికూడ 5 వ తరగతి తర్వాత చేయవచ్చు. ప్రభుత్వానికి  భారమైనప్పటికి విద్యార్ధులకు తెలుగు మీడియంలో చదివే చాయిస్ కూడ వుండాలి. 5. కాని తెలుగు రాష్ట్రాలలోని మధ్యతరగతి సమాజం ఆం.మా తప్ప ఇంకొకటి చదివే పరిస్థితిలో లేదు. విపరీతంగా జరిగిన ప్రయివేటీకరణ, ప్రభుత్వ రంగంలో విద్యను నాశనం చేయడం, పేదవారు తప్ప ఇంకెవ్వరు ప్రభుత్వ బడులకు వెళ్ళని స్థితి కల్పించాయి ఈ రాష్ట్రాన్ని ఏలిన తెదేపా, కాంగ్రెసు నాయకత్వాలు (అందులో పెత్తనం చెలాయించిన ఆధిపత్య కులాలు). వారు టీవీ చానళ్ళ ముందుకొచ్చి మాతృభాష అంటూ మాట్లాడడానికి అనర్హులు.  6. ఇపుడున్న వాతావరణంలో ఎక్కువమంది పేద, మధ్యతరగతి వారు ఆం.ప్ర ప్రభుత్వ  చర్యను సమర్ధిస్తారు. కొంతమంది ప్రయివేటు నుండి ప్రభుత్వ స్కూళ్ళకు తమపిల్లలను మారుస్తారు. కాని ప్రమాణాల పరిస్థితి ఏమిటి. 7. అమ్మ ఒడి పథకం ప్రభుత్వ స్కూళ్ళకే వర్తింపచేయాలనేది నా అభిప్రాయం. 8. నాసిరకం తెలుగు మాధ్యమం నుంచి నాసిరకం ఇంగ్లీషు మాధ్యమంలో చదవడం తప్ప ఇంగ్లీషు పై పట్టు పెరుగుతుందని నాకనిపించడం లేదు.

టీవీ చర్చలో రానివి -1. ఎంసెట్ ను రద్దు చేస్తే చాల సమస్యలు తీరతాయి – ముఖ్యంగా మాధ్యమానికి సంబంధించి. 2. వ్యక్తిగతం – ప్రశ్న: మీ పిల్లలు ఏ మీడియం లో చదివారు?  జవాబు: ఇంగ్లీషు మీడియం.   ప్రశ్న: మరి బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దా? వారు పైకి రావడం మీకిష్టం లేదు, మీ ఆధిపత్యం పోతుందనే వ్యతిరేకిస్తున్నారు. జవాబు: పైన నేనిచ్చిన విశ్లేషణలో దీనికి జవాబు దొరుకుతుంది. బడుగు, బలహీన వర్గాలు పైకి రాకూడదనే విద్యను ఇంత దుర్మార్గంగా ప్రయివేటీకరించాయి తెదాపా, కాంగ్రెసు ప్రభుత్వాలలో ఆధిపత్యం చెలాయించిన వారు. ఇపుడు చేస్తున్నది కంటితుడుపు చర్యే.  3. ముగింపు: ఆం.ప్ర ముఖ్యమంత్రి కొన్ని విషయాలలో నిబద్ధతతో వ్యవహరిస్తున్నారు. ఆర్టీసి పై వేసిన “విలీన కమిటీ” లో నేను సభ్యుడుగా వున్నపుడు, ఆర్టీసి పట్ల ఆయన మాటకు కట్టుబడి వుండడం గమనించాను. (అన్ని విషయాలపై నేను వ్యాఖ్యానించడం లేదు). కాబట్టి ఆం.ప్ర లో పాఠశాల విద్య ప్రమాణాలు పెంచి, విద్యను అందరికీ (ముఖ్యంగా ఇపుడు వివక్షకు గురౌతున్నవారికి) అందుబాటులోకి తేవాలంటే  పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులను మెరుగుపరచాలి. అక్కడ పిల్లలకు ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించాలి. మూత్రశాలలు, మరుగుదొడ్లు వాటి శుభ్రత వగైరాల పై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లల శానిటరీ అవసరాలపట్ల శ్రద్ధ వహించాలి. టీచర్లను, అధికారులను ఆ విధంగా ప్రోత్సహించాలి, శిక్షణలు ఇప్పించాలి. పాఠశాల విద్యా మంత్రి, అధికారుల పాత్ర ఇక్కడ కీలకం. ఈ విధంగా చేయగలిగితే 2-3 సం.లలో గణనీయమైన పురోగతి సాధించవచ్చు. అప్పుడు మీడియం కంటే ఇంగ్లీషు సబ్జక్టు ముఖ్యమని విద్యార్ధులను, తల్లిదండ్రులను నమ్మించవచ్చు.

Share.

Leave A Reply