ఆకు పచ్చని ఆలోచన

Google+ Pinterest LinkedIn Tumblr +

 datepalm_Cell-phone-antennas-mix-with-fake-tree-limbs-in-Great-Falls-Park-225x300మనసుంటే ఆకుపచ్చని మార్గం ఉండును అనే సిద్దాంతాన్ని నమ్ముకున్న అమెరికన్‌ కంపెనీ …. వీరు చేసిన కొత్త ఆలోచన ఇపుడు ప్రపంచాన్ని ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది.ఇక్కడ చూస్తున్న పచ్చని భారీ వృక్షాలు నిజానికి చెట్లు కావు.వీటి వెను క గొప్ప సృజనాత్మకత ఉంది.
సెల్‌ ఫోన్‌ లేనిదే క్షణం గడవదు. కానీ ఆకాశంలోకి దూసుకెళ్లినట్టుండే భారీ సెల్‌ టవర్‌ చూస్తే అందరికీ భయం. వీటిని చూసి పక్షులు కూడా జడుసుకుంటున్నాయి. అందుకే పిచ్చుకల జాతి అంతరించి పోతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన పడుతున్నారు.

ఇకపై పిట్టలు కూడా గూడు కట్టుకునేలా Larson Camouflage ఇంజనీర్లు సెల్‌టవర్స్‌ని కళాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక్కడ కనిపించే వృక్షజాతులు అన్నీ సెల్‌ టవర్లే. ఆఫ్రికన్‌ దేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మీరు ఆర్డర్‌ ఇస్తే ఏదేశంలోనైనా వీటిని నిర్మించడానికి  Larson  సిద్దంగా ఉంది.

మన రెండు తెలుగు రాష్ట్రాలను సింగపూర్‌గా మారుస్తామంటున్న ముఖ్యమంత్రులు ఇలాంటి వాటి పై దృష్టి పెడితే కాస్త విభిన్నంగా ఉంటుంది కదూ…

 

 

saguaro_Cell-phone-antennas-mix-with-fake-tree-limbs-in-Great-Falls-Park-225x300   pine-225x300

Share.

Comments are closed.