బడికి వెళ్లాలంటే ఈత కొడుతూ వెళ్లాలా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బడికి వెళ్లాలంటే ఈత కొడుతూ వెళ్లాలా?
……………………………………………….
అందరికీ విద్య మన ప్రాథమిక  హక్కు.
కానీ ప్రాథమిక  విద్య అందాలంటే ఈ పాఠశాలకి కిలో మీటర్‌ దూరం కొండకిందికి నడవాలి. మధ్యలో నీటి ప్రవాహాన్ని పుస్తకాలు నెత్తిమీద పెట్టుకొని దాటాలి. గట్టిగా వాన పడితే ఈ నీటిమట్టం పెరిగి పిల్లలు కొట్టుకు పోయే ప్రమాదం కూడా ఉంది.అయినప్పటికీ ఈ కష్టాలను ఈదుతూ చదువుకుంటున్నారు. వారినొక సారి పలకరిద్దామా?
కొండ దిగి రావాలి…
విజయనగరం జిల్లా, కురుపాం మండలం ఏజెన్సీ ఏరియా.పార్వతీపురం ఐటిడిఏ లో ఉంది. ఇక్కడి గొటివాడ పంచాయితీలోని హిల్‌టాప్‌ ప్రాంతం బోరి బండలగుడ్డి. ఇక్కడి నుండి పది మంది విద్యార్దులు గెడ్డ(వర్షాలు ఎక్కువ పడినపుడు ఏర్పడే నీటి ప్రవాహం) దాటుకుంటూ వెళ్లి తడిసిన దుస్తులను ఆరబెట్టుకొని, గొటివాడ  పాఠశాలకు వెళ్తున్నారు. ఆగస్టు నుండి అక్టోబర్‌ వరకు వానల వల్ల ఈ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి ఈ గిరిబిడ్డలు అవస్ధలు పడుతున్నారు.
సర్వేలో బయట పడిన వాస్తవం

 బోరి గ్రామ పిల్లలు గెడ్డ దాటుతున్నగిరిబిడ్డలు

బోరి గ్రామ పిల్లలు గెడ్డ దాటుతున్నగిరిబిడ్డలు

గిరిజనులు ప్రగతి కోసం పనిచేస్తున్న ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో 57 పాఠశాలల్లో ప్రధానమైన సమస్యలు, విద్యాహక్కుల చట్టం అమలు తీరును చట్టం పరిధిలో విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతుల అమలును సంస్థ పరిశీలించినపుడు ఈ అడవిబిడ్డల సమస్య బయట పడింది.
పరిష్కారం ఎలా?
ి ప్రవాహాన్ని దాటుతూ ప్రమాదకర పరిస్థితుల్లో బడికి వెళ్తున్న పిల్లలను కాపాడుకోవాలంటే అక్కడ చిన్న వంతెన నిర్మిస్తే సరిపోతుందని ఇంజనీరంగ్‌ నిపుణులంటున్నారు. రూ.15లక్షల నుండి 20లక్షల వరకు నిధులు ఖర్చు అవుతాయని అంచనా. లేదా వీరికి బోరిలోనే బడిని ఏర్పాటు చేయాలి. ఈ సమస్యను ఆర్ట్స్‌  సంస్థ గత రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంత వరకు పరిష్కారానికి ప్రయత్నం జరుగ లేదు. ఫలితంగా గత ఎడాదికంటే ఈ సారి నీటి ప్రవాహం పెరిగి పిల్లలు ఈత కొడుతూ వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడిందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.
గిరిజన సంస్కృతికి అనువైన విద్య కావాలి
‘ఇక్కడి కొండ ప్రాంతంలో సవర గిరిజనులు నివశిస్తున్నారు. వీరు జీవిస్తున్న భౌగోళిక పరిస్దితులకు అనువుగా మౌలిక వసతులు కల్పించాలి. కొండ శిఖరం మీద కుగ్రామాల నుండి వీరు చదువుకోవడానికి కిందికి దిగి రావాలి. ఆ క్రమంలో నీటి ప్రవాహాలు దాటాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఇలాంటి హిల్‌టాప్‌ గ్రామాలు విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో 450ఉన్నాయి. ఈ సమస్యనుండి కాపాడాలంటే వీరుండే చోటునే సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి చదువు చెప్పాలి. పిల్లలకు 1నుండి 3వ తరగతి వరకు సవర భాష తెలిసిన టీచర్లు బోధిస్తేనే వారు పాఠాలను అర్దం చేసుకోగలరు. దీనికి ఇంటర్మీడియట్‌ చదివిన ఇక్కడి నిరుద్యోగ యువతను టీచర్లను నియమించాలి…” అని ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ సిఇఓ సన్యాసిరావు ‘ రూరల్‌ మీడియా’ తో అన్నారు.
పరిష్కారం దిశగా అడుగులు…
ఆదివాసీ గిరిజన బిడ్డలు చదువుకు దూరమవుతున్న తీరును విజయనగరంలోని సేవాసంస్ధలు, ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లగా వారిలా స్పందించారు.

Indian Navy Lieutenant Commander P Swathi

Lieutenant Commander P Swathi

‘ నా చిన్నపుడు నేను కూడా ప్రభుత్వపాఠశాలలో చదివాను కానీ ఇంత ఘోరంగా లేవు అప్పటి పరిస్దితులు. బావి భారత పౌరులు చదువుకోవడానికి మొలలోతు నీటిలో దిగి పోవడం చూస్తుంటే మనం సాధించిన అభివృద్ధి ఇదేనా అని బాధ కలుగుతుంది. సముద్రం మీద సాహసం చేసిన నాకు, చదువు కోసం ఈ గిరిజన బిడ్డలు చేస్తున్న సాహసం చూస్తుంటే ఆశ్యర్యంతో పాటు బాధ కలుగుతోంది. ఈ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం త్వరగా చొరవ చూపాలి. వీరి కష్టాలను సమాజం దృష్టికి తెచ్చిన రూరల్‌మీడియా,నిర్మాణ్‌ టీంకి అభినందనలు.”

-Indian Navy Lieutenant Commander P Swathi

పౌర సమాజం స్పందించాలి…
‘ ఎంతో అభివృద్ది సాధించామని చెప్పుకుంటున్న మన మధ్య పిల్లలు చదువుకోసం పడుతున్న బాధలు అమానవీయం. ఈ సమస్య పరిష్కారానికి పార్వతీపురం రోటరీ క్లబ్‌ సభ్యుల ద్వారా వీలైనంత కృషి చేస్తాం.’ అన్నారు, విజయనగరం రోటరీక్లబ్‌ సభ్యుడు జయకృష్ణ,

డియర్‌ రీడర్స్‌ ఈ స్టోరీని చదివి ఊరుకోకుండా, సమస్య పరిష్కారం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి.  జిల్లా అధికారుల కి ఈ స్టోరీ లింక్‌ని పంపండి.

1, District Collector Dr. M. Hari Jawaharlal IAS, Contact -08922-276720, E mail – collector_vznm@ap.gov.in

2, Project Officer,I.T.D.A,  Dr.G.Lakshmisha IAS,  Contact –  08963-221152, E mail – poitdappm@gmail.com

3, Member of parliament,Vizianagaram, P..Ashok Gajapathi Raju , Contact 9440822599

( ఈ సమస్యను జిల్లా పాలనాధికారి,ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాం. వారి స్పందనలను బట్టి ఈ స్టోరీ… అప్‌ డేట్‌ అవుతుంటుంది.)
– Shyammohan/ruralmeia/nirmaan(Pics/Arts NGO)

This article is presented under RuralMedia-Nirmaan partnership

Share.

Leave A Reply