సలామమ్మా … సఫాయమ్మా !!

Google+ Pinterest LinkedIn Tumblr +

  ఉదయం 5 గంటల కే మెలకువ రావడంతో.. ఈ సమయంలో సిటీ ఎలా ఉంటుందో చూడాలనిపించింది.రోడ్‌ మీదకు వచ్చాను… నగరం నిద్రలేచిందో లేదో తెలియని స్ధితి…

 పంజాగుట్టలో ఇరానీ టీ లేదు. ఆటోలు సీటీబస్‌ల సందడి లేదు. నాగార్జున సర్కిల్‌ మీదుగా  వెంగళరావు పార్క్‌ వైపు నడుస్తుంటే లోపలి నుండి పూల పరిమళం పలకరించింది. అటు నుండి, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3, వైపు తిరుగుతుంటే…ఓవైసీ కాలేజీ నుండి చల్లని చిరు గాలి చెంపల్ని తాకింది. ప్రాణవాయువు పీల్చిన ఫీలింగ్‌…ఈ నగరంలో ఇంత ఆహ్లాదకరమైన ఉదయం ఇదే చూడటం. పావురాల రెక్కల   చప్పుడు తప్ప, మనుషు అలికిడి అస్సలు  లేదు. హైదరాబాద్‌లో ఇంత నిశ్శబ్దం ఎన్నడూ చూడలేదు.

 కానీ, ఈ నిశ్శబ్దాన్ని చీలు స్తూ…

 రహదారుల పక్కనే రాలిన పూలను,ఆకులను ఊడుస్తున్న చప్పుడు… మార్నింగ్‌ రాగా లా విన్పించింది. ఇళ్ల బయట ఉన్న చెత్తని ట్రాలీ లోకి ఎత్తుతున్నారు … బ్లీచింగ్‌ పౌడర్‌ స్ప్రే చేస్తూ, ఒక పద్దతిగా, బాధ్యతగా నగరాన్ని తుడుస్తున్న సఫాయి కార్మికుల ను చూస్తుంటే, దేశ సరిహద్దుల్లో  ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సిపాయిలు గుర్తుకు వచ్చారు.

 ఈ మట్టిలో పుట్టి,  మట్టిలో పెరిగి,  ముఖాల కు సరైన మాస్కులు కూడా లేకుండానే వీరు వీధుల్లో  కరోనాతో ఎలా తల పడుతున్నారు ?  ఇప్పుడు సఫాయి కార్మికులే మనకు దేవుళ్లుగా ఎలా మారారో తెలుసుకోవాలంటే , మంచి ముత్యం లాంటి  మంచిర్యాల యువకుడు
Dulam Satyanarayana అత్యంత గౌరవంతో, భక్తితో విజువలైజ్‌ చేసిన అద్భుతం చూడండి. https://youtu.be/wLFmvNh_l8Y

Share.

Leave A Reply