ఏపీలో సంక్షేమ విప్లవం !!

Google+ Pinterest LinkedIn Tumblr +

” మతిస్తిమితం లేని ఈ పాపను తీసుకొని రెండుకిలోమీటర్లు పోవాల్సివచ్చేది, ఆ రోజు కూలీ పని వదిలి ఆమెతో పాటు వెళ్లి, గంటలు తరబడి పంచాయితీ ఆఫీసులో పడిగాపులు పడిన తరువాత ఎపుడో ఇచ్చేవారు.ఆ పింఛన్‌లో మూడొందలు దారిఖర్చులకు పోయేది. మరో ఆరు వందలు ఆరోజు కూలీ ఆదాయం పోయేది… ఇలాంటి కష్టాల మధ్య….
ఈ రోజు ఉదయమే ఇంటికొచ్చి పింఛన్‌ చేతికిచ్చి వెళ్లారయ్యా…కలో నిజమో అర్ధం కలేదయ్యా… ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి…” కర్నూలు జిల్లా, మహానంది మండలంలో, ఈశ్వర్‌నగర్‌లోని నిరుపేద మానసిక వికలాంగురాలు మహేశ్వరి తల్లిదండ్రులు రూరల్‌ మీడియాతో చెబుతున్నపుడు,వారి గొంతులోని ఉధ్వేగం మమ్మల్ని కదలించింది.

ఎన్నికలకు ముందు పాదయాత్రలో, తాను అధికారంలోకి వస్తే నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి పింఛన్ల పంపిణీ చేపడతానని, వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
అవ్వాతాతల ముఖాల్లో ఆనందం , సంతోషం చూడాలన్నదే తన లక్ష్యమని ఆయన ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగానే సూర్యోదయం కాకమునుపే లబ్ధిదారులను తట్టిలేపి, వలంటీర్లు స్మార్ట్‌ఫోన్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడంతో, సంక్షేమపథకాల అమలులో ఒక చారిత్రక అధ్యాయంగా మారింది.
ఫిబ్రవరి 1నుండి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వ ద్ధాప్య, వితంతు, దివ్యాంగులందరికీ , నేరుగా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేపట్టారు. అంతేకాకుండా ప్రభుత్వం ‘నవశకం’ ద్వారా రాష్ట్రంలో 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. వారందరికీ ఈ నెల నుండే కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది.

లబ్దిదారుల కళ్లలో వెలుగు…
” వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుడు ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసే విధానం గ్రామస్తులను ఆకట్టుకుంటోంది. పింఛన్లు కోసం పంచాయితీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న ఫించన్‌ దారులకు డోర్‌ డెలివరీ చేయడం వారికి ఎంతో ఆనందం కలిగిస్తోంది. అన్నిచోట్లా గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులకే ఇళ్లకే వెళ్లి పింఛన్‌ అందజేశారు. జీవిత చరమాంకంలో వున్న వ ద్ధులు, మంచం పట్టిన వ్యాధిగ్రస్తులు, కనీసం కదల్లేని స్థితిలో వున్న దివ్యాంగులు… గతంలో పెన్షన్‌ తీసుకోవడానికి స్వయంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఎంతో కష్టంగా వెళ్లాల్సి వచ్చేది. సీఎం గారి నిర్ణయంతో ఇప్పుడు వారున్నచోటే ఫించన్‌ ఇవ్వడంతో, సంతోషంగా ఉన్నారు. ” అని, మహానంది మండలం ఎం.డి ఓ ఉమామహేశ్వరరెడ్డి అన్నారు.
తొలి రోజే 996.79 కోట్లు మంజూరు…
ఒకేరోజు మొత్తం లబ్ధిదారులకు పెన్షన్‌ చేరాలనే ప్రయత్నంలో భాగంగా తొలిరోజే 76.59 శాతం పంపిణీ చేశారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం… లబ్ధిదారులకు చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేయడం ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలు కల్పించింది. పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వాలంటీరుకు ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చింది.
పెన్షన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు రికార్డు స ష్టించారు. తొలిరోజే 996.79 కోట్ల రూపాయల పింఛన్లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు జిల్లాల పరిధిలో మొత్తం 41 లక్షల 87 వేల 919 మంది లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54.68 లక్షల మంది పెన్షన్‌ లబ్ధిదారులుండగా… వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1320 కోట్ల రూపాయల్ని విడుదల చేసింది.
అవమానించినా…
” మగవాళ్లు లేనపుడు తలుపులు కొడతారా? ఎపుడు పడితే అపుడు ఇళ్లకు వెళ్తారా ? మీరు చేసేవి …మూటలు మోసే ఉద్యోగాలు…? ఇలా మా వాలంటీర్లనందరినీ అనేక రకాలుగా అవమానించినా, ఈ రోజు కదలలేని స్ధితిలో ఉన్న వృద్దుల ఇంటికి వెళ్లి ఫించన్‌ వారి చేతిలో పెట్టినపుడు వారి కళ్లలోని ఆనందం అవమానాలను మర్చిపోయేలా చేసింది. ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రభుత్వం మాకు కల్పించినందుకు సంతోషంగా ఉంది…” అని తూర్పుగోదవరి జిల్లాకు చెందిన కొందరు విలేజ్‌ వాలంటీర్లు చెప్పారు.

” ప్రజల దీవెనతోనే ఇది పాధ్యం ”
” పెన్షన్లను గడపవద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు అభినందనలు. అవినీతి,వివక్ష లేకుండా 54.6లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్‌ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింతగా పెంచింది. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైంది.
ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్‌ రూ.వేయి కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్‌ వయస్సు కూడా 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి, వెంటనే వాటిని పరిశీలించి మంజూరుచేస్తారు…” అని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

meeting with villagers at Prakasham District

” ఎన్నికల ముందు పాదయాత్ర చేశాడు,అధికారం చేపట్టాక హామీ ఇచ్చిన పథకాలను పరుగులు పెట్టిస్తున్నాడు. గత ఏడు నెలలుగా విద్య,ఉపాధి ,పేదరిక నిర్మూలనలో జగన్‌ వేస్తున్న అడుగులు ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి..” అని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.
కొన్ని కార్యక్రమాలు చాలా అల్పంగా కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం మామూలుగా ఉండదు… జనం హ దయాలను ఎలా గెలవాలో జగన్‌ కి మాత్రమే …తెలిసిన విద్య !!
……….( గ్రౌండ్‌ రిపోర్ట్‌…. శ్యాంమోహన్‌ )

Share.

Leave A Reply